Lokesh Kanagaraj: సినిమా ఇండస్ట్రీలో ఎవరి కెరియర్ అయిన ఎంత కాలం పాటు కొనసాగుతుందో ఎవరు చెప్పలేరు…కాబట్టి ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతను ఫాలో అవుతూ సినిమాలు చేసుకుంటూ వెళ్తే మంచిదని సినిమా పెద్దలు సైతం ఇండస్ట్రీ లో ఉన్నవాళ్ళకి సలహాలిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలోనే విక్రమ్ సినిమాతో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన దర్శకుడు లోకేష్ కనకరాజు… ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఇండియాలో ఆయన పేరు మార్బ్రోగిపోయింది. అలాంటి దర్శకుడు ఆ తర్వాత వెంటనే ‘విక్రమ్ 2’ సినిమా చేయాల్సింది. లేదంటే సూర్యతో రోలెక్స్ అనే సినిమాని స్టార్ట్ చేయాలి. ఇవి రెండు కాకపోయిన కార్తీ తో ‘ఖైదీ 2’ సినిమాను చేసిన బాగుండేది. కానీ ఆయన ఇవేవీ చేయకుండా విజయ్ తో ‘లియో’ అనే సినిమా చేశాడు… లోకేష్ యూనివర్స్ అనే ఒక దానిని క్రియేట్ చేశాడు. లియో సినిమాని సైతం లోకేష్ యూనివర్సల్ లో భాగంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ అది బెడిసి కొట్టింది. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో లోకేష్ కనకరాజు పేరు చాలావరకు డల్ అయింది.
ఆ తర్వాత రజనీకాంత్ తో చేసిన కూలీ సినిమా సైతం లోకేష్ కనకరాజు స్టాండర్డ్ లో లేదని జనాలు రిజెక్ట్ చేశారు… ఇదంతా చూస్తుంటే లోకేష్ కనకరాజు యూనివర్స్ కి ఉన్న క్రేజీ ని తగ్గించడానికి ఆయన ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నాడా అనే డౌట్ అందరికీ వస్తోంది. యూనివర్స్ మీద చాలా క్రేజ్ ఉన్నప్పటికి అలాంటి సినిమాలనే యూనివర్స్ గా కలుపుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది.
అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను చేసుకుంటూ వెళితే అతనికి ఉన్న మార్కెట్ భారీగా పడిపోతోంది… ప్రస్తుతం ఆయన అదే పరిస్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు లోకేష్ కనకరాజు మాతో సినిమా చేస్తే బాగుండు అని స్టార్ హీరోలందరు అభిప్రాయపడేవారు. కానీ ఇప్పుడు అతను కథ చెప్తాను అన్నా కూడా ఏ స్టార్ హీరో కూడా రెస్పాండ్ అవ్వడం లేదంటే అతని మార్కెట్ ఎంతలా పడిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు.
మొత్తానికైతే విక్రమ్ సినిమాని అద్భుతంగా మలిచిన ఆయన ఆ తర్వాత లియో, కూలీ సినిమాలను మాత్రం సక్సెస్ చేయడంలో తీవ్రంగా విఫలమయ్యాడు. అది కంప్లీట్ ఆయన ఫెయిల్యూర్ గానే మనం భావించొచ్చు… ఇప్పటికైనా ఒక మంచి సినిమా చేసి మరోసారి కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి…