Indian Cinema Universe: సినిమా ఇండస్ట్రీ లో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి…ప్రేక్షకుడి అభిరుచి మేరకు ప్రతి దర్శకుడు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నారు…ఒకప్పుడు సినిమా అంటే ప్రేక్షకుడిని మూడు గంటల పాటు ఎంటర్ టన్ చేసి భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టేవి… ఇక ఆ తర్వాత సినిమాలకు సీక్వెల్స్ ని ప్లాన్ చేస్తూ చాలామంది దర్శకులు సినిమాలు చేసి మంచి విజయాలుగా మార్చే ప్రయత్నాలైతే చేశారు…అయితే ఈ మధ్యకాలంలో మాత్రం ఒక దర్శకుడు చేసిన సినిమాలన్నింటిని కలిపి ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. నిజానికి ఈ ఆలోచన వచ్చిన మొదటి దర్శకుడు లోకేష్ కనకరాజ్ కావడం విశేషం…ఆయన క్రియేట్ చేసిన ఈ సినిమాకి యూనివర్స్ ను చాలా మంది దర్శకులు ఫాలో అవుతూ వాళ్ళకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసుకుంటున్నారు. ముందుగా లోకేష్ చేసిన ఖైదీ, విక్రమ్ సినిమాలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేశాడు.
Also Read: పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే ఈ నలుగురు హీరోల వల్లే అవుతుందా..?
ఇక ఆ తర్వాత లియో సినిమాతో ఆ యూనివర్స్ ను మరింత ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాని యూనివర్స్ నుంచి బయటికి వచ్చి తీశాడు. ఇక ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ కాలేదు…ఇక రాబోతున్న ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలతో మరోసారి అతను తన సినిమాటిక్ యూనివర్స్ ను మరింతగా బలపరచాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఈయన వేసిన బాటలోనే ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి దర్శకుడు నడుస్తూ ఉండడం విశేషం… ఒక రకంగా లోకేష్ కనకరాజును మనం ట్రెండ్ సెట్టర్గా పిలుచుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండుకి శ్రీకారం చుట్టిందే ఆయన కాబట్టి ఆయన్ని సినిమాటిక్ యూనివర్స్ సృష్టికర్త అనే చెప్పాలి…ఇక తన సినిమాటిక్ యూనివర్స్ ని మరింత స్ట్రాంగ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: చిరంజీవిలో రామ్ చరణ్ కి నచ్చని ఒకే ఒక క్వాలిటీ ఏంటో తెలుసా..?
మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు లోకేష్ కనకరాజు తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన కూలీ సినిమాతో ఆయన ఆశించిన మేరకు ప్రేక్షకుడిని మెప్పించలేకపోయాడు. కాబట్టి మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకుంటే తప్ప ఆయనకు ప్రేక్షకుల నుంచి భారీ గుర్తింపైతే వచ్చే అవకాశాలు లేవు…
