Lokesh Kanagaraj Remuneration: కూలీ తర్వాత లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) తో ఒక సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒక కార్టూన్ వీడియో తో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వేరే లెవెల్ లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఎక్కడ చూసిన ఈ వీడియో లోని బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ తో రీల్స్, పోస్టులు కనిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన ప్రకటన వీడియో నే ఈ రేంజ్ సెన్సేషన్ సృష్టిస్తే, ఇక రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి రాబోయే ప్రమోషనల్ కంటెంట్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మీరే ఊహించుకోండి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు అనేదానిపై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చించుకుంటున్నారు.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నందుకు గాను లోకేష్ కనకరాజ్ వంద కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ లోకేష్ కనకరాజ్ కి పాతిక కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన టీం కి ఒక ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఒక సరైన క్రమ పద్దతిలో జరిగేలా చూస్తున్నారు. లోకేష్ కనకరాజ్ గత చిత్రం కూలీ కి దాదాపుగా 70 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచినప్పటికీ లోకేష్ డిమాండ్ మార్కెట్ లో ఇసుమంత కూడా తగ్గలేదు. అల్లు అర్జున్ చిత్రం తో ఆయన భారీ లెవెల్ లో కం బ్యాక్ ఇస్తే ఈసారి వెయ్యి కోట్ల గ్రాస్ ని అవలీలగా కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు?, విలన్ గా ఎవరు చేయబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. లోకేష్ కనకరాజ్ ఈమధ్య కాలం లో తన ప్రతీ సినిమాలోనూ టాప్ స్టార్స్ ని నెగిటివ్ రోల్ లో చూపించి ఆశ్చర్యానికి గురయ్యేలా చేసేవాడు. ఆయన గత చిత్రం కూలీ లో అక్కినేని నాగార్జున ని విలన్ రోల్ లో చూపించి ఆడియన్స్ ని షాక్ కి గురయ్యేలా చేసాడు. అలా ఈసారి ఏ స్టార్ హీరో ని అలాంటి రోల్ లో చూపించబోతున్నాడా అని ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. జూన్ నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.