Lokesh Kanagaraj Pawan Kalyan: ‘కూలీ'(Coolie Movie) చిత్రం ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) మన టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కి ఒక స్టోరీ వినిపించాడని కొందరు, పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) తో ఒక సినిమా ఖరారు అయ్యిందని మరికొందరు, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అయ్యాయి. దేనికి కూడా అధికారిక సమాచారం లేదు. కానీ పవన్ కళ్యాణ్ తో లోకేష్ కనకరాజ్ మూవీ ఉంటుందని తమిళ టాప్ మీడియా చానెల్స్ కూడా అధికారిక ప్రకటన చేసింది. మరోపక్క అల్లు అర్జున్ పీఆర్ టీం కి బాగా దగ్గరగా ఉండే కొన్ని సోషల్ మీడియా పేజీలు పవన్ కళ్యాణ్ తో కాదు, అల్లు అర్జున్ తో లోకేష్ మూవీ ఉంటుందని చెప్పుకొచ్చాయి. ఈ రెండిట్లో ఏది నిజం అనేది జనవరి లో తేలనుంది.
ఎందుకంటే లోకేష్ కనకరాజ్ నేడు హైదరాబాద్ లోకి అడుగుపెట్టాడు. తానూ తియ్యబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో కి ఫైనల్ స్క్రిప్ట్ న్యారేషన్ ఇవ్వడానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో కచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే కాదని ఒక క్లారిటీ వచింది. ఎందుకంటే నేడు ఆయన హైదరాబాద్ లో లేరు, ఇప్పటం గ్రామం లో పర్యటిస్తున్నారు. మరోపక్క అల్లు అర్జున్ హైదరాబాద్ లోనే ఉన్నాడు, కాబట్టి లోకేష్ కనకరాజ్ వచ్చింది అతని కోసమే అని అంటున్నారు విశ్లేషకులు. దానికి తోడు అల్లు అర్జున్ కి అత్యంత ఆప్తుడైన బన్నీ వాసు, నేడు జరిగిన ఒక ప్రెస్ మీట్ లో జనవరి నెలలో అల్లు అర్జున్ కి సంబంధించిన రెండు కొత్త ప్రాజెక్ట్స్ ని అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. నేడు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ ఒకటి ఖరారైంది. ఇక రెండవ సినిమా లోకేష్ కనకరాజ్ తో అయ్యి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది .
ఒకవేళ అల్లు అర్జున్, లోకేష్ మూవీ ఖరారు అయితే, ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉంటుంది. అలా కాకుండా పవన్ కళ్యాణ్, లోకేష్ కాంబినేషన్ లో మూవీ ఖరారు అయితే అది KVN ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఉంటుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే, ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయని, కానీ ముందుగా ఏ సినిమా మొదలు అవుతుంది అనేదే తెలియాలని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మైంటైన్ చేస్తున్న సరికొత్త లుక్; లోకేష్ కనకరాజ్ మూవీ కోసమే అని అంటున్నారు విశ్లేషకులు. న్యూ ఇయర్ కి ఈ విషయం లో ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.