Homeఎంటర్టైన్మెంట్Bloody Valentine glimpse: బ్లడీ వాలెంటైన్ అంటూ బీభత్సమైన వయొలెన్స్ తో అల్లకల్లోలం సృష్టించిన లోకేష్...

Bloody Valentine glimpse: బ్లడీ వాలెంటైన్ అంటూ బీభత్సమైన వయొలెన్స్ తో అల్లకల్లోలం సృష్టించిన లోకేష్ కనకరాజ్!

Bloody Valentine glimpse: లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj)..ఈ పేరు సౌత్ ఇండియా లోనే కాదు, ఇండియా లోనే బిగ్గెస్ట్ బ్రాండ్. ‘ఖైదీ’ , ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’, ‘కూలీ’ వంటి చిత్రాలతో ఇండియా లోనే టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం ఇండియా లో ఉన్న ప్రతీ సూపర్ స్టార్ ఈయనతో ఒక సినిమా చెయ్యాలని అనుకుంటాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత అంతటి రేంజ్ ని సొంతం చేసుకున్నది ఈయనే. ఇతని గత చిత్రం ‘కూలీ’ అభిమానులను అంతగా అలరించలేదు, అయినప్పటికీ కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈయన బ్రాండ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిది అనేది. అయితే ఇప్పుడు ఆయన మొట్టమొదటిసారి హీరో గా మారి DC అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు.

నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబందించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. బ్లడీ వాలెంటైన్ పేరుతో విడుదల చేసిన ఈ గ్లింప్స్ వీడియో లో హద్దులు దాటినా వయొలెన్స్ ని చూపించాడు డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో కూడా ఈ రేంజ్ వయొలెన్స్ ని చూపించలేదు. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ వామిక గబ్బీ నటిస్తోంది. ఈ గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత కథ పై ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేసింది. క్రిమినల్ పనులు చేసే ఒక వ్యక్తిని అమ్మాయి ప్రేమించడం. అతను చేసే పనులు ఆమెకు నచ్చకపోయినా కూడా భరించి అతని వెంట నడవడం, వీళ్లిద్దరి మధ్య జరిగే ఎమోషన్స్ ని ఆధారంగా తీసుకొని ఈ సినిమాని రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులో లోకేష్ కనకరాజ్ చాలా వయొలెంట్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నాడు.

ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగానే ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అయితే భవిష్యత్తులో కూడా ఆయన హీరో గా నటించే అవకాశాలు ఉన్నాయి. ఇక తాను దర్సకత్వం వహించే ప్రతీ సినిమాకు సంగీతం అందించే లోకేష్ కనకరాజ్, ఈ చిత్రానికి కూడా సంగీతం అందించాడు. అయితే కేవలం తన మ్యూజిక్ తోనే సినిమాకు క్రేజ్ ని తీసుకొచ్చే లోకేష్ కనకరాజ్, ఈ చిత్రానికి ఇప్పటి వరకు అలాంటి మ్యూజిక్ బిట్ ని ఒక్కటి కూడా ఇవ్వకపోవడం గమర్హం. నేడు విడుదల చేసిన గ్లింప్స్ వీడియోల్ని మ్యూజిక్ కూడా చాలా యావరేజ్ గా ఉంది. కాసేపు కూడా గుర్తు పెట్టుకునే రేంజ్ లో లేదు. మరి సినిమాలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో చూడాలి.

Bloody Valentine - Glimpse Video | DC | Lokesh Kanagaraj | Sun Pictures | Anirudh | Arun Matheswaran

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version