Lokesh Kanagaraj career : సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. పెద్ద పెద్ద సూపర్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వారసులు కూడా రెండు మూడు సినిమాలకే కెరీర్ ని మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చి , నేడు బాక్స్ ఆఫీస్ ని శాసించే స్థాయికి ఎదగడం అంటే చిన్న విషయం కాదు. అదృష్టం , టాలెంట్ , బోలెడంత హార్డ్ వర్క్ వంటివి ఉండాలి. అవన్నీ ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) లో ఉన్నాయి. మన టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ హీరో గా నటించిన ‘నగరం’ అనే చిత్రం ద్వారా డైరెక్టర్ గా వెండితెర కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ రేంజ్ లో ఆడింది.
ఆ తర్వాత ఈ డైరెక్టర్ కి ఇటు టాలీవుడ్ లో కానీ, అటు కోలీవుడ్ లో కానీ ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. కొన్నాళ్ళు ఒక్కటంటే ఒక్క అవకాశం కోసం ఈ డైరెక్టర్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాంటి సమయం లో ఈయన తమిళ డైరెక్టర్ కార్తీ తో కలిసి చేసిన ‘ఖైదీ’ చిత్రం కమర్షియల్ గా పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత లోకేష్ కనకరాజ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా హిట్టు మీద హిట్టు కొడుతూ ఎవ్వరూ అందుకోలేనంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ క్రేజ్ డైరెక్టర్ తో ఒక్క సినిమా చేయడానికి ఇండియా లోని ప్రతీ సూపర్ స్టార్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈయన రేంజ్ ఎలాంటిది అనేది. అయితే లోకేష్ కనకరాజ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడు అనే సంగతి చాలా మందికి తెలియదు.
ఈయన తమిళనాడు ప్రాంతం లోని కోయంబత్తూర్ కి చెందిన వ్యక్తి . అక్కడే తన విద్యాబ్యాసం ని పూర్తి చేసిన ఈయన , బ్యాంక్ లో ఉద్యోగి గా కొనసాగే వాడు. ఈ కాలం లో బ్యాంక్ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్యాంక్ ఉద్యోగాన్ని మించిన జాబ్ సెక్యూరిటీ ఎక్కడా ఉండదని అంటుంటారు. అలాంటి బ్యాంక్ ఉద్యోగాన్ని వదిలేసి, తన టాలెంట్ ని నమ్ముకొని సినీ ఇండస్ట్రీ లోకి వచ్చాడు. ఒకవేళ సినిమాల్లో ఈయనకు అవకాశాలు దొరకకపోయుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. బంగారం లాంటి ఉద్యోగాన్ని పోగొట్టుకొని , జీవితాన్ని నాశనం చేసుకున్న వ్యక్తిగా మిగిలిపోయేవాడు. కానీ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆడియన్స్ నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు అనే పెద్దల మాటలను నిజం చేస్తూ , ఈ డైరెక్టర్ ఎవ్వరూ అందుకోనంత ఎత్తుకి ఎదిగిపోయాడు.