Karthi: సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తెలుగు మరియు తమిళం బాషలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న హీరో కార్తీ..తెలుగు లో ఇతగాడికి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన సర్దార్ చిత్రం ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది..తెలుగు లో ఈ విడుదల రోజు పోటీగా మూడు సినిమాలు విడుదలయ్యాయి..ఆ మూడు సినిమాలను ఈ చిత్రం మొదటి రోజు ఓపెనింగ్స్ నుండే డామినేట్ చేసింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు లో 5 కోట్ల 30 లక్షల రూపాయలకు జరగగా మొదటి..ఇప్పటి వరుకు 7 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక ప్రపంచవ్యాప్తంగా తమిళ బాషా కూడా కలిపి సుమారు 93 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఫుల్ రన్ లో వంద కోట్ల మార్కుని అందుకొనే ఛాన్స్ కూడా ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే సౌత్ లో ఏ హీరోకి కూడా సాధ్యపడని అరుదైన రికార్డు ని కార్తీ సాధించాడు..అదేమిటి అంటే మూడు నెలల్లో మూడు సినిమాలు విడుదల చేసి మూడు కూడా భారీ బ్లాక్ బస్టర్స్ హిట్స్ కొట్టిన హీరో గా అరుదైన రికార్డుని నెలకొల్పాడు..ఆయన హీరోగా నటించిన వీరుమాన్ చిత్రం ఆగష్టు 12 వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని సుమారుగా 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇక సెప్టెంబర్ 30 వ తారీఖున విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది మన అందరం చూసాము..సుమారు గా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికి విజయవంతంగా రన్ అవుతూనే ఉంది.

ఇక అక్టోబర్ 21 వ తారీఖున విడుదలైన సర్దార్ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు వైపు అడుగులు వేస్తుంది..అలా మూడు నెలల్లో విడుదలైన ఈ మూడు సినిమాల కలెక్షన్స్ కలిపితే 700 కోట్ల రూపాయిల గ్రాస్ లెక్క తేలుతుంది..అలా మూడు నెలల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత బిజినెస్ చేసిన ఏకైక హీరో గా కార్తీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.