Simhadri Re Release: ఇండస్ట్రీ కి వచ్చి కేవలం రెండేళ్లు మాత్రమే అయ్యింది, కేవలం 19 ఏళ్ళ కుర్రాడు, కాలేజీ కి వెళ్లి చదువుకునే వయస్సులో ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తో చెడుగుడు ఆడుకున్నాడు. అతను మరెవరో కాదు , మాస్ కి పర్యాయపదం లాగ ఉండే జూనియర్ ఎన్టీఆర్.అప్పట్లో ఈయన చేసిన సింహాద్రి చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 గ్రాసర్ గా నిల్చింది.అంతే కాకుండా 146 కేంద్రాలలో 100 రోజులు , మరియు 53 కి పైగా కేంద్రాలలో 175 రోజలు పూర్తి చేసుకొని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది. నందమూరి ఫ్యాన్స్ ని ‘సింహాద్రి’ పేరు ఎత్తితేనే పూనకాలు వచ్చేస్తాది. అలాంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.
దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ ప్రాంతాలలో ప్రారంభం అయ్యాయి, విచిత్రం ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగని ఈ సినిమాకి , ఓవర్సీస్ లో మాత్రం అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.ఇప్పటికే అమెరికా లో 24 వేల డాలర్లు గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ఇంకా సినిమా విడుదలకు రెండు రోజుల సమయం ఉంది, ఈ రెండు రోజుల్లో కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ఇది ఇలా ఉండగా జపాన్ లో కూడా ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంది.అక్కడ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ మొన్ననే ప్రారంభించారు, ఇక్కడ ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 1 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసిందట, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 5 లక్షల రూపాయిల గ్రాస్ అన్నమాట.
అడ్వాన్స్ బుకింగ్స్ క్లోజ్ అయ్యే సమయానికి 2 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు, అంటే ఫైనల్ గా 10 లక్షల రూపాయిల గ్రాస్ అన్నమాట. దేశం కానీ దేశం లో ఈ రేంజ్ బుకింగ్స్ జరగడం అనేది చూడడం ఇదే తొలిసారి. #RRR తర్వాత ఎన్టీఆర్ కి పెరిగిన పాన్ వరల్డ్ స్టార్ స్టేటస్ కి నిదర్శనం ఇదే అని గర్వంగా చెప్పుకుంటున్నారు నందమూరి ఫ్యాన్స్.