‘లీసా హెడెన్’ (Lisa Haydon) హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చిన మోడల్. అలాగే బాలీవుడ్ లో నటిగా కూడా ‘లీసా హెడెన్’ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా ఆమె మూడోసారి తల్లి అయింది. జూన్ 22న లీసా హెడెన్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, గత రెండు నెలలుగా ఆమె అభిమానులు బేబీ ఫొటోలను షేర్ చేయమని ఆమెను సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తున్నారు.
పైగా పుట్టింది ఆడబిడ్డా? మగపిల్లడా? అని తెలియజేయమని లీసా హెడెన్ కు రోజూ వేల మెసేజ్ లు వస్తున్నాయి. అయినప్పటికీ లీసా హెడెన్ మాత్రం ఇప్పటివరకు తన చిన్నారిని ఫ్యాన్స్ కి చూపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది. కానీ తొలిసారి తనకు పుట్టింది కుమార్తె అని, తన కూతురు ఫోటోలను పోస్ట్ చేసింది.
పైగా ఈ సందర్భంగా తన ముద్దుల తనయ పేరును కూడా ఈ ప్రపంచానికి చెబుతూ ‘లారా’ అంటూ పేరును రివీల్ చేసింది. మొత్తానికి లీసా హెడెన్ తాజాగా తన కుమార్తె ఫొటోను పోస్ట్ చేస్తూ సరికొత్త లుక్ తో తిరిగి ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఇక నెటిజన్లు అలాగే ఆమె అభిమానులు, మరియు సన్నిహితులు లీసా హెడెన్, మరి ఆమె చిన్నారి సంతోషంగా ఉండాలని విష్ చేస్తున్నారు.
కాగా లీసా హెడెన్ చెన్నైలో పుట్టి పెరిగింది. మొదట తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేసినా ఆమెకు ఆశించిన స్థాయిలో అక్కడ ఛాన్స్ లు రాలేదు. దాంతో మోడల్ గా కెరీర్ ఆరంభించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చింది. హిందీలో తన ప్రతిభతో మంచి అవకాశాలు అందిపుచ్చుకుంది.
‘హౌస్‌ఫుల్ 2’, ‘క్వీన్’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక లీసా హెడెన్ 2016లో బిజినెస్ మెన్ లల్వానీని పెళ్లాడింది.
View this post on Instagram