Liquor Sales On Dussehra: మద్యం ఏరులై పారింది. దసరా సందర్భంగా భారీగా మద్యం అమ్మకాలు సాగాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఎంతో లాభం చేకూరింది. ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి మద్యం ఓ ప్రధాన ఆదాయ వనరుగా మారింది. దీంతో మందుబాబుల బలహీనతలను తమకు ఆసరాగా చేసుకుంటోంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ లేబుల్ వేసి మరీ మద్యం అమ్ముతూ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది రెట్టింపు ఆదాయం రావడం గమనార్హం. సర్కారుకు ఇబ్బంది కలగకుండా మద్యం ద్వారా ఆదాయం రావడంతో ప్రభుత్వానికి లోటు లేకుండా పోతోంది.

గత ఏడాది మద్యం ద్వారా మనకు వచ్చిన ఆదాయం రూ. 504 కోట్లు వస్తే ఈ సంవత్సరం రూ.1158 కోట్లు రావడం గమనార్హం. ఇందులో ప్రభుత్వానికి దాదాపు రూ.926 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలోనే మద్యం అమ్మకాలు జోరుగా సాగినట్లు సమాచారం. నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక జరగనున్నసందర్భంలో పార్టీలు విందులు, వినోదాలు ఏర్పాటు చేయడంతో మద్యం అమ్మకాలు జోరుగా జరిగాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రెట్టింపులో రావడంతో ఆర్థిక కష్టాలు తీరినట్లే.
Also Read: Nagababu- Garikapati Narasimha Rao: చిరంజీవిలా కాదు.. గరికిపాటికి నాగబాబు పంచులు.. అదిరిపోలా.?
మద్యం అమ్మకాల్లో హైదరాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్లొండ, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాలు ముందంజలో నిలిచాయి. రోజు దాదాపు ూ. 80 కోట్ల విలువైన మద్యాన్ని డిపోల ద్వారా తరలించారు. అక్టోబర్ 3న రూ. 138 కోట్లు, 4న రూ.192 కోట్లు, 6న రూ.135 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు చెబుతున్నారు. వారం రోజుల్లో రూ.1158 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రూ. 26 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల్లో 80 శాతం ప్రభుత్వ ఖజానాకి చేరుతోంది.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది. అన్ని పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో మద్యం అమ్మకాలకు రెక్కలొచ్చాయి. ఫలితంగా భారీగా ఆదాయం రావడంతో సర్కారుకు ఉపశమనం కలుగుతోంది. దీంతో ఆర్థిక కష్టాలు తీరి ఆదాయం సమకూర్చుకుంది. దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వానికి ఆదాయం రావడంతో ఇక వారి కష్టాలు తీరినట్లే అని చెబుతున్నారు. మద్యం ద్వారా ఇంత ఆదాయం వస్తుందని మాత్రం అనుకోలేదు.
Also Read:Adipurush Poster Copied: కాపీ కొడితే కొట్టారు కనీసం క్రెడిట్ ఇవ్వరా… మరో వివాదంలో ఆదిపురుష్!