Lion Kiran: ఇటీవల కాలలో బర్త్‌డే పార్టీలు ట్రెండీ లుక్‌ను తలపిస్తున్నాయి. పబ్‌ల్లో, ఇంట్లో, లేదా ఎక్కడైనా గ్రాండ్ హోటల్లో అందరూ జరుపుకుంటుంటారు. కానీ, ఓ వ్యక్తి ఇప్పటి వరకు మునుపెన్నడూ చేసుకోని వినూత్న పద్దతిలో పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు. సుచిర్ ఇండియా అధినేత లయన్ కిరణ్ పుట్టిరోజును వేడుకను ఆయన సన్నిహితులు కే పార్టిగా ఏటా ఒక థీమ్‌తో సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే శిల్పారామం రాంజ్ రాక్ హైట్స్‌లో కె పార్టీ కౌబాయ్ స్టైల్ ఫ్యాషన్ లుక్‌లో కనిపించారు. జాలీగా ఎంజాయ్ చేస్తూ బాలీవుడ్ పాటలకు స్టెప్పులేసి అదరగొట్టారు.

ఈ పార్టీలో టాలీవుడ్ స్టార్స్, సినీ నటులు, ప్రముఖ వ్యాపార వేత్తలు పాల్గొన్నారు. కౌబాయ్ థీమ్లోనిర్వహించిన బర్త్‌డే కార్యక్రమం అతిథులకు మరచిపోలేని అనుభూతిని పంచింది. నృత్యాలు, విందు వినోదాలు, ఫ్యాషన్ షో తదితర కార్యక్రాలతో వావ్ అనిపించాయి. స్వయంగా లయన్ కిరణ్ షో స్టాపర్‌గా మారడం విశేషం. ఆయనే స్వయంగా రాంప్ వాక్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ప్రస్తుతం ఈవీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు ఈ రకంగా కూడా బర్త్‌డే జరుపుకుంటారా అని కామెంట్లు చేస్తున్నారు.