Kingdom Teaser: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత యంగ్ హీరో విజయ్ దేవరకొండ(vijay devarakonda), జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) తో కలిసి చేసిన ‘కింగ్డమ్(Kingdom)’ చిత్రానికి సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే మూవీ టీం విడుదల చేయగా, దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్ కి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వాయిస్ ఓవర్ ఇవ్వడం హైలైట్ గా నిల్చింది. ఆయన బేస్ వాయిస్ విన్న తర్వాత టీజర్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒకానొక దశలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజెన్స్ ని డామినేట్ చేసినట్టుగా అనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఈ టీజర్ ని చూసిన తర్వాత ప్రొడక్షన్ విలువలను పొగడకుండా ఉండలేము. నాగవంశీ ఈమధ్య కాలంలో తన సినిమాలకు ప్రొడక్షన్ విషయం లో అసలు తగ్గడం లేదు. ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాల క్వాలిటీని చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు.
అంతకు మించిన క్వాలిటీ తో విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రం తెరకెక్కినట్టు ఈ టీజర్ ని చూస్తే తెలుస్తుంది. ఈ టీజర్ ని చూస్తుంటే పునర్జన్మ కాన్సెప్ట్ మీద తెరకెక్కిన సినిమాగా అనిపించింది. ఇండియన్ ఆర్మీ చేసే పోరాటం, మధ్యలో అమాయక జనాలు ప్రాణాలు కోల్పోవడం వంటివి చూస్తే డైరెక్టర్ గౌతమ్ ఎదో పెద్దగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది. టైటిల్ కార్డు కి ఇరువైపులా బాణాలు దూసుకొని వెళ్తున్నట్టుగా పెట్టాడు. ఇదంతా చూస్తుంటే మహాభారతం లోని కర్ణుడి క్యారక్టర్ ని హీరో గా ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం జరిగిందా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మహాభారతం లో నియమం ప్రకారం పాండవులకంటే పెద్దవాడైన కర్ణుడికి హస్తినాపురం సింహాసనం దక్కాలి. కానీ చిన్న తనం లోనే తల్లి నుండి వేరు అయిపోయి, ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా కర్ణుడు దుర్యోధనుడితో స్నేహం చేయడం, పాండవులకు విరోధిగా మారడం వంటివి మనకి తెలిసిందే.
ఆ కారణం చేత ఆ జన్మలో హస్తినాపురం సింహాసనం ని దక్కించుకోలేకపోయింది కర్ణుడు, పునర్జన్మలో దక్కించుకునే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేశాడా? అనే సందేహాలు కూడా ఆడియన్స్ లో వచ్చింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించనున్నారు. మొదటి భాగం లో ప్రస్తుత జన్మకు సంబంధించిన కథని చూపిస్తే, రెండవ భాగంలో పునర్జన్మకు సంబంధించిన కథని చూపిస్తారని తెలుస్తుంది. వాస్తవానికి ఈ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేయాలి,కానీ ఆ సమయంలో ఆయన ‘గేమ్ చేంజర్’ మూవీ చేస్తుండడంతో ఈ చిత్రాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ని చూసిన తర్వాత రామ్ చరణ్ బంగారం లాంటి సినిమాని వదిలేసుకున్నాడు అనే బాధ అభిమానుల్లో కలిగింది. ఈ చిత్రం తో విజయ్ దేవరకొండ నేరుగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు అని చెప్పొచ్చు. మే 30 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపుతిప్పుతుందో లేదో చూడాలి.