‘ఉప్పెన’తో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ పై తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఎగసిపడిన కృతి శెట్టి.. మొత్తానికి ఒక్క హిట్ తోనే నాలుగు సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. పైగా మొదటి సినిమాతోనే కృతి శెట్టి అద్భుతమైన నటి అంటూ ఆమెకు ప్రసంశలు అందాయి. కానీ, ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో కృతి శెట్టి సరిగ్గా నటించడం లేదు అంటూ ఓ డైరెక్టర్ ఆమె పై సీరియస్ అయ్యాడు.
ఇంతకీ ఎవరు ఆ డైరెక్టర్ అంటే.. తమిళ డైరెక్టర్ లింగుస్వామి. రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ప్రస్తుతం ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. కాబట్టి, కృతిశెట్టి పై దర్శకుడు ఒక ఎమోషనల్ సీన్ ను ప్లాన్ చేశాడు.
అయితే, ఆ ఎమోషనల్ సీన్ లో నటించే సమయంలో కృతిశెట్టి తడబడింది. దర్శకుడు కోరిన ఎమోషనల్ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వలేక ఎక్కువ టేకులు తీసుకొంది. మరోపక్క ప్యాడింగ్ ఆర్టిస్ట్ లు అంతా తమ షాట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సీన్ లో సీనియర్ నటుడు నాజర్ కూడా ఉన్నారు. అప్పటికే గంట సేపు ఎదురు చూసి విసిగిపోయిన ఆయన, కాస్త అసంతృప్తిగా కనిపించారట.
అది గమనించిన లింగుస్వామి, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కృతి శెట్టి పై గట్టిగా కేకలు వేసినట్లు తెలుస్తోంది. పైగా షూటింగ్ కి కూడా అర్ధగంట సేపు బ్రేక్ ఇచ్చారట. ఆ తర్వాత కృతి శెట్టిని పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో కూల్ గా మాట్లాడి, మొత్తానికి ఆమెను ఆ సన్నివేశం మూడ్ లోకి తీసుకొచ్చి.. ఆ సీన్ ను పూర్తి చేశారు. కాకపోతే ఆ సీన్ కోసం రోజులో సగం వృధాగా పోయిందట.
ఇక సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి పాటలను స్వర పరుస్తున్నాడు. రామ్ – దేవి శ్రీ ప్రసాద్ కలయికలో గతంలో మ్యూజిక్ పరంగా మంచి సూపర్ హిట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ సినిమాని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు. రామ్ ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.