Vijay Deverakonda: జరగాల్సిన నష్టం జరిగాక మేలుకున్నా ప్రయోజనం ఏముంది చెప్పండి. హీరో విజయ్ దేవరకొండ తీరు అలానే ఉంది.తన నోటి దురుసుతో కలెక్షన్స్ కోల్పోయిన విజయ్ ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపట్టాడు. లైగర్ చిత్రాన్ని బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ నడిచింది. దానికి చాలా కారణాలున్నాయి. ట్విట్టర్ లో బాయ్ కాట్ లైగర్ మూవీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్న క్రమంలో విజయ్ దేవరకొండ నోటి దురుసు చూపించాడు. నా సినిమాను కావాలంటే బాయ్ కాట్ చేసుకోండి అన్నారు.

విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ లైగర్ చిత్ర వసూళ్లను భారీగా దెబ్బతీశాయని ముంబైకు చెందిన మనోయ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. మనోజ్ దేశాయ్ ముంబైలో పేరుగాంచిన గెయిటీ గెలాక్సీ, మరాఠా మందిర్ థియేటర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. లైగర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంటే అంతా నాశనమైందని ఆయన ప్రెస్ మీట్ లో వాపోయాడు. అదే సమయంలో విజయ్ దేవరకొండ అలాంటి కామెంట్స్ చేసినందుకు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అతడు అహంకారి. వినాశ కాలం రావడంతో అలా ప్రవర్తిస్తున్నాడు.
పొగరుగా మాట్లాడి అమిర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు లైగర్ కి కూడా అదే జరిగింది. విజయ్ తన సినిమాను కావాలంటే అవైడ్ చేసుకోండని చెప్పడంతో ఆన్లైన్ బుకింగ్స్, ఓపెనింగ్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. మనోజ్ దేశాయ్ కామెంట్స్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందించారు. స్వయంగా వెళ్లి మనోజ్ దేశాయ్ ని కలిసి క్షమాపణలు కోరారు. అలాగే శక్తివంచన లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తానని హామీ ఇచ్చాడట. విజయ్ క్షమాపణలు చెప్పడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారట. సినిమా పరిశ్రమ దెబ్బతింటుందన్న ఆవేదనలో అలా మాట్లాడినట్లు మనోజ్ అన్నారట.

హిందీలో లైగర్ కలెక్షన్స్ పర్లేదు. మూడు రోజుల్లో ఈ మూవీ రూ. 10 కోట్ల నెట్ కలెక్షన్స్ వరకూ రాబట్టింది. కొంతలో కొంత నష్టం తగ్గించుకునే ప్రయత్నంలో విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి మనోజ్ దేశాయ్ కి క్షమాపణలు చెప్పి ఉండవచ్చు. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. ఫస్ట్ షో నుండే లైగర్ కి డిజాస్టర్ టాక్ వచ్చింది. .