https://oktelugu.com/

Liger- Agent Movies: ‘సాలా’ అనే పదం సినిమా ఇండస్ట్రీ కి తెచ్చిన నష్టం అక్షరాలా 200 కోట్లు

గత ఏడాది విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన 'లైగర్' చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా లో చాలా బూతులు ఉంటాయి, టైటిల్ క్రింద క్యాప్షన్ 'సాలా క్రాస్ బ్రీడ్' అనేది కూడా బూతు పదమే, అలా చేస్తే యూత్ ఆకర్షితులు అవుతారు అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : May 1, 2023 / 04:10 PM IST
    Follow us on

    Liger- Agent Movies: కుర్రాళ్లు బూతు పాదాలకు బాగా ఆకర్షితులు అవుతున్నారని, బాగా రీచ్ ఇచ్చేస్తున్నారని ఈమధ్య మేకర్స్ ఇష్టమొచ్చినట్టు బూతులు సినిమాల్లో పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటివి పెట్టాలంటే భయపడేవారు, కానీ ఇప్పుడు భరితెగించేసారు.అయితే కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు బూతులు పెట్టడం లో తప్పులేదు. కానీ అసలు కంటెంట్ లేకుండా ఇష్టమొచ్చినట్టు బూతులు పెడితే మాత్రం ఆడియన్స్ ఛీ కొడుతారు. అందుకు ఉదారణగా రెండు సినిమాల ఫలితాలను తీసుకుందాము.

    గత ఏడాది విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లైగర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా లో చాలా బూతులు ఉంటాయి, టైటిల్ క్రింద క్యాప్షన్ ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది కూడా బూతు పదమే, అలా చేస్తే యూత్ ఆకర్షితులు అవుతారు అనుకున్నారు. కానీ కంటెంట్ లేకపోవడం వల్ల డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.

    రీసెంట్ గా విడుదలైన అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ సినిమాని కూడా మరో ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ చిత్రం ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ఒక పదం కామన్ గా వినిపిస్తుంది.ఆ పదం పేరే ‘వైల్డ్ సాలా’ . తలా తోక లేకుండా సినిమా ఒకటి తీసి, ప్రేక్షకుల మీదకి వదిలి ఇలా ‘వైల్డ్ సాలా’ లాంటి బూతులు వాడితే జనాలు తిప్పి కొడుతారు అనడానికి మరో ఉదాహరణ ఇది.మొత్తానికి ఈ ‘సాలా’ అనే పదం ఈ రెండు సినిమాల నిర్మాతల కొంపలు ముంచేసాయి. లైగర్ చిత్రానికి దాదాపుగా 100 కోట్ల రూపాయిల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    ఫుల్ రన్ కలెక్షన్స్ కేవలం 20 కోట్లు మాత్రమే రాబట్టింది. అంటే 80 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట, అలాగే ‘ఏజెంట్’ చిత్రానికి దాదాపుగా 80 కోట్లు ఖర్చు చేసారు, ఫుల్ రన్ లో ఈ చిత్రం పది కోట్ల రూపాయిల లోపే రాబట్టేలా ఉంది.దీనితో ఈ సినిమాకి సాలిడ్ గ 75 కోట్ల రూపాయిల నష్టం.దీనితో పాటు ప్రింటు ఖర్చులు మరియు పబ్లిసిటీ కి అయ్యే ఖర్చు ఇలా అన్నీ లెక్కలు తీస్తే సుమారుగా 200 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అట.