Megastar Chiranjeevi: ఆచార్య సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రాంచరణ్ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కావడంతో అభిమానులకు పండగే అనుకున్నారు. కానీ అనుకున్నది తారుమారైంది. సినిమా బోల్తాపడింది. కనీసం పెట్టుబడి కూడా రాదని తెలియడంతో అభిమానులు సినిమా యూనిట్ నైరాశ్యంలో పడింది. ఎంతో ఊహించుకున్నా ఫలితం మాత్రం ఇలా దెబ్బతీయడంతో అందరిలో ఆందోళన కలుగుతోంది.
కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు ఆచార్య సినిమాకు కూడా అనేక పొరపాట్ల జరిగినట్లు తెలుస్తోంది. కానీ ఎవరు కూడా బయటకు రావడం లేదు. జరిగిన నష్టానికి ఎవరిని నిందించాలో కూడా అర్థం కావడం లేదు. దీంతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆచార్య సినిమా అపజయానికి ఓ వార్త మాత్రం షికారు చేస్తోంది. కొత్తగా ఓ సెంటిమెంట్ ను తెర మీదకు తెస్తున్నారు.
చిరంజీవి నటించిన సినిమాల్లో అ అక్షరంతో మొదలైన సినిమాలన్ని పరాజయం చవిచూశాయని చెబుతున్నారు. ఆ కోవలో ఆరని మంటలు, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఆలయ శిఖరం, ఆరాధన, ఆపద్భాంధవుడు లాంటి సినిమాలు ఉన్నాయి. అంకుశం ను హిందీలో రీమేక్ చేయగా దానికి ఆజ్ కా గుండారాజ్ అని పేరు పెట్టినా అది హిట్ అయింది. అయితే అది మన భాష కాదనే వాదన వస్తోంది.
ఇకపై చిరంజీవి తీసే సినిమాలకు పొరపాటున కూడా అ తో మొదలయ్యే పేరు పెట్టకుండా ఉండాలని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోయే గాడ్ ఫాదర్ లో చిరంజీవి ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాల్సిందే. సినిమా షూటింగ్ పూర్తయింది. కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మొత్తానికి తెలుగు చిత్ర సీమలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
భవిష్యత్ లో తీయబోయే సినిమాలపై కూడా చిరంజీవి క్లారితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దాని వెనుక ఒకటి ఆయన ఓకే చెబుతున్నారు. సినిమాల ఎంపికలో దూకుడుగా కాకుండా ఆలచించి నిర్ణయం తీసుకుని ప్రేక్షకులకు కనువిందు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇకపై చిత్రాల నిర్మాణంలో మరింత మెలకువగా ఉండి అపజయాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.
Recommended Videos: