Anasuya: బుల్లితెరపై హాట్ హాట్ అందాలకు కేరాఫ్ అనుసూయ, తన అందంతో ఏ షో చేసినా హైప్ అవ్వాల్సిందే! నిజానికి అందం మాత్రమే తన సొంతం కాదు తనలో అభినయానికి నూటికి నూరు మార్కులు పడ్డ సందర్భాలూ లేకపోలేదు.

అనసూయ బుల్లితెరపై ఒక సెన్సేషనల్ తన అంద చందాలకు అశూయపడని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో? నిజానికి జబర్దస్త్ ప్రోగ్రామ్ లో కామెడీకంటే అనసూయ అందంతో అంతకుమించిన టైమింగ్ తో ఆ ప్రోగ్రామ్ టీఆర్పీని అమాంతం పెంచిందని ఓపెన్ టాక్ నడుస్తోంది. తన డ్రెస్సింగ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ నడిచినా తను పెద్దగా పట్టించుకోక పోగా అంతకు మించి అన్నట్లుగానే చేస్తూ వచ్చింది అనశూయ, ఒక్క గ్లామర్ తోనే బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుందా అంటే అదీ లేదు పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రంగస్థలం సినిమాలో అలరించి తన లో సత్తా ఏంటో ప్రేక్షకలోకానికి చూపించింది. అలాంటి రంగమ్మత్త పాత్రకే నూటికి నూరుశాతం న్యాయం చేసిన అనసూయ సుమారు తొమ్మిదొందల మంది ఓటర్లున్న మా ఎన్నికల్లో తన అందం అభినయం రెండూ పనికి రాకుండా పోయాయని తెగ బాధ పడిపోతోంది. నిజానికి అనసూయ భారీ మెజారిటీతో గెలుపొంద బోతోదంన్న వార్త మీడియాలో చూసిన సగటు అభిమానికి ఆఖరుకి నిరాసే ఎదురైంది.
అనసూయ ఈసీ మెంబర్ గా పోటీ చేసి అనూహ్యంగా ఓడి పోవడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతోంది. పెద్దగా ప్రాముఖ్యత ఉండని ఈసీ మెంబర్ గా పోటీ చేసేందుకు అనసూయ సిద్దం అయిన సమయంలో చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అనసూయకు అవసరమా? అంటూ కొందరు అభిప్రాయ పడ్డా తను మాత్రం మా ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని పోటీకి సిద్ధమైంది. కాని అనూహ్యంగా అనసూయ ఓటమి పాలయిన తర్వాత ఆమెకు తెలిసొచ్చిందేంటంటే? అనవసరమైన విషయంలో వేలెట్టి తప్పు చేశానని తొందరగానే గ్రహించింది. ఇటు బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే రంగమ్మత్తకు సిల్వర్ స్క్రీన్ పై అడదడపా అవకాశాలు బాగానే వస్తున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం మానేసి అంతగా ప్రాధాన్యత లేని ఎన్నికల్లో పోటీ చేయడమెందుకు? తరువాత బాధపడటమెందుకని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇకపై ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయబోనని ట్విట్టర్ ద్వారా తెలిపింది అనసూయ.
అనసూయ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇంత చిన్న ఓటమికే అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఏంటని, కొందరు కామెంట్స్ చేస్తుంటే కొందరు మాత్రం మంచి నిర్ణయం తీసుకున్నావంటూ, కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాల సందర్బంగా అనసూయ గెలిచింది అంటూ మొదట ప్రచారం జరిగింది. మీడియాలో అందరు కూడా అనసూయ విజయం సాధించిందంటూ వచ్చిన న్యూస్ నిజం కాకపోవడంతో అనుసూయ తో పాటు ఆమె అభిమానులను సైతం నిరాశ పరిచింది.
అయితే మా లో ఉన్నవే 900 ఓట్లైతే అందులో పోల్ అయిన ఓట్లే కొన్ని.. వాటినే తర్వాత రోజు లెక్కించడం విడ్డూరంగా అనిపించిందని అనసూయ అసంతృప్తి వ్యక్తం చేసింది. మా ఎన్నికల్లో అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదని కాసింత అదృష్టం కూడా కలిసి రావాలన్న విషయం కాస్త ఆలస్యంగా తెలిసొచ్చింది మన అందాల అనసూయకు.