Lesbian Couple On Bigg Boss: ఇండియన్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్న రియాలిటీ షోస్ లో ఒకటి బిగ్ బాస్(Bigg Boss). అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ని జనాలు బాగా నచ్చారు. హిందీ లో మొదలైన ఈ బిగ్ బాస్ షో, ఆ తర్వాత కన్నడ, తమిళం, తెలుగు మరియు మలయాళం భాషల్లో ప్రారంభించారు. అన్నిట్లోనూ సెన్సేషనల్ హిట్ అయ్యింది. తెలుగు లో అయితే ఏకంగా 8 సీజన్స్ ని పూర్తి చేసుకొని, రాబోయే సెప్టెంబర్ నెల నుండి 9వ సీజన్ ని ప్రారంభించుకోనుంది. అదే విధంగా మలయాళం లో ఈ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా మోహన్ లాల్(Mohanlal) వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 7 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో, ఇప్పుడు 8 వ సీజన్ లోకి అడుగుపెట్టింది. ఈ సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చేసింది.
Also Read: ఘాటీ ట్రైలర్ రివ్యూ…ఆ షాట్స్ ను ఆ సినిమా నుంచి కాపీ చేశారా..?
ప్రతీ సీజన్ లో లాగానే ఈసారి కూడా ఆడియన్స్ కి ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీలు ఉన్నారు. అయితే ప్రేక్షకులను ఇప్పుడు విశేషంగా ఆకర్షిస్తున్న కంటెస్టెంట్స్ అదీలా, ఫాతిమా. వీళ్లిద్దరు లెస్బియన్స్. ఈ ప్రేమ జంట ఇప్పుడు బిగ్ బాస్ షోలో కనిపించబోతుంది. ఇంతకీ వీళ్లిద్దరి స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అదీలా, ఫాతిమా కేరళకు చెందిన అమ్మాయిలు. వీళ్లిద్దరు ఒకరిని ఒకరు ఘాడంగా ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమను కుటుంబ సభ్యులతో పాటు, ప్రపంచం మొత్తం తప్పుబట్టింది. కానీ వీళ్లిద్దరు మాత్రం వెనకడుగు వేయలేదు. ప్రపంచం తో పోరాడి తమ ప్రేమని కోర్టుని ఆశ్రయించి గెలిపించుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమ కథ దేశం లోనే ఒక సంచలనంగా మారింది. ప్రేమకి లింగం తో సంబంధం లేదని, నిజమైన ప్రేమని ఆ దేవుడి దిగి వచ్చినా అడ్డుకోలేరని నిరూపించి చూపించారు. కోట్లాది మందికి ఆదర్శంగా నిల్చిన వీళ్లిద్దరి ప్రేమ ఎలా మొదలైందో చూద్దాం.
సౌదీ అరేబియా లో 12 వ తరగతి చదువుకుంటున్న రోజుల్లో అదీలా, ఫాతిమా ఒకరికి ఒకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. ఆ స్నేహం కొన్ని రోజుల తర్వాత అవధులు దాటింది. ఇది ప్రేమ అని, ఒకరిని ఒకరు వదిలి బ్రతకలేమని ఇద్దరూ తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు వీళ్ళ ప్రేమని అంగీకరించకపోవడంతో ఇంటి నుండి పారిపోయి కోజీకోడ్ లో ఆశ్రయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అదీలా కుటుంబం అదీలా ని తమ ఇంటికి బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో ఫాతిమా కోర్టు ని ఆశ్రయించింది. అదేలా కుటుంబం పై ‘హెబియస్ కార్పస్’ కేసు ని వేసింది. అదీలా ని తన ఇష్టానికి వ్యతితేకంగా తీసుకెళ్లి ‘కన్వెర్షన్ థెరఫీ’ ని చేయిస్తున్నారని ఆమె పిటీషన్ లో ఆరోపించింది. ఈ విషయం పై ఇద్దరితో ప్రత్యేకంగా విచారణ జరిపిన కోర్టు,వీళ్లిద్దరు కలిసి జీవించడానికి అనుమతిని ఇచ్చింది. అలా పాపులర్ అయిన ఈ జంట ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుందో.