Bigg Boss 6 Contestants Remuneration: అత్యధికంగా 60 అత్యల్పంగా 15… లీకైన బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్!

Bigg Boss Contestants Remuneration: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా మొదలైంది. 21 మంది కంటెస్టెంట్స్ తో కూడిన రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. చలాకీ చంటి, సింగర్ రేవంత్, కీర్తి భట్, అభినయశ్రీ, బాల ఆదిత్య వంటి టాప్ సెలబ్రిటీలతో పాటు పెద్దగా గుర్తింపు లేని ఆదిరెడ్డి, ఆరోహి రావ్, ఇనయా సుల్తానా లాంటి పెద్దగా గుర్తింపు లేనివారు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక జనాల్లో సదరు సెలెబ్రెటీలకు ఉన్న ఫేమ్, […]

Written By: Shiva, Updated On : September 7, 2022 4:19 pm
Follow us on

Bigg Boss Contestants Remuneration: బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ గా మొదలైంది. 21 మంది కంటెస్టెంట్స్ తో కూడిన రియాలిటీ షో ఆసక్తికరంగా సాగుతుంది. చలాకీ చంటి, సింగర్ రేవంత్, కీర్తి భట్, అభినయశ్రీ, బాల ఆదిత్య వంటి టాప్ సెలబ్రిటీలతో పాటు పెద్దగా గుర్తింపు లేని ఆదిరెడ్డి, ఆరోహి రావ్, ఇనయా సుల్తానా లాంటి పెద్దగా గుర్తింపు లేనివారు కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇక జనాల్లో సదరు సెలెబ్రెటీలకు ఉన్న ఫేమ్, ఇన్కమ్ ఆధారంగా బిగ్ బాస్ నిర్వాహకులు రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Bigg Boss Contestants Remuneration

హౌస్ లో అత్యధికంగా ఒక కంటెస్టెంట్ రోజుకు రూ. 60 వేలు తీసుకుంటుండగా… అత్యల్పంగా మరొక కంటెస్టెంట్ కేవలం రూ. 15 వేలు తీసుకుంటున్నారట. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న 21 మంది కంటెస్టెంట్స్ ఎవరు ఎంత పారితోషికం తీసుకుంటున్నారనే సమాచారం బయటికొచ్చింది. దానికి ప్రకారం… ఎవరెవరి రెమ్యూనరేషన్స్ ఎంత ఉన్నాయో చూద్దాం…

1. కీర్తి భట్:

బిగ్ బాస్ సీజన్ 6 ఫస్ట్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. మోస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్ ‘కార్తీక దీపం’ లో కీర్తి భట్ లీడ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమె రెమ్యూనరేషన్ రోజుకు రూ.35 వేలు అట.

2. సుదీప :

ఇక సెకండ్ కంటెస్టెంట్ సుదీప రోజుకు రూ. 20 వేలు తీసుకుంటున్నారట. ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుదీప పింకీగా చాలా పాపులర్. సుదీప కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు.

3. శ్రీహాన్ :

యూట్యూబర్ శ్రీహాన్ అనూహ్యంగా రోజుకు రూ. 50 వేలు ఛార్జ్ చేస్తున్నాడట. కేవలం సిరి లవర్ గా వెలుగులోకి వచ్చిన శ్రీహాన్ కి యాభై వేలంటే మామూలు విషయం కాదు.

4. నేహా చౌదరి :

యాంకర్ నేహా చౌదరి రోజుకు రూ.30 వేలు తీసుకుంటున్నారట. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన నేహా చౌదరి, ఐపీఎల్ యాంకర్ గా కూడా చేశారు.

5. శ్రీ సత్య :

ప్రముఖ మోడల్ అండ్ యాక్ట్రెస్ శ్రీసత్య రోజుకు రూ.30 వేలు ఛార్జ్ చేస్తున్నారట.

6. అర్జున్ కళ్యాణ్ :

సీరియల్ నటుడు అర్జున్ కి రోజుకు రూ.35 వేలు పారితోషికం ఇస్తున్నారట. అర్జున్ కళ్యాణ్ కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే సీరియల్ యాక్టర్ గా ఉన్నాడు.

7. చలాకీ చంటి :

జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి బుల్లితెర షోలతో చాలా బిజీ. జబర్దస్త్ ద్వారా కూడా ఆయనకు మంచి సంపాదన ఉంది. అవన్నీ వదిలేసి వచ్చిన చలాకీ చంటి రోజుకు రూ. 50 వేలు తీసుకుంటున్నాడట.

8. అభినయ శ్రీ :

ఒకప్పటి ఐటెమ్ గర్ల్ అభినయశ్రీ రోజుకు రూ.20 వేల ఒప్పందంపై హౌస్ కి వచ్చారట. ఓ పదేళ్ల క్రితం అభినయశ్రీ తెలుగులో వరుసగా ఐటెం సాంగ్స్ చేశారు. కొన్ని చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో కనిపించారు.

9. గీతూ రాయల్ :

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన గీతూ రాయల్ రోజుకు రూ.25 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. రాయలసీమ యాసతో ఆకట్టుకునే ఈ డేరింగ్ ఉమన్, జబర్దస్త్ లో కూడా చేసింది.

Bigg Boss Contestants Remuneration

10. బాల ఆదిత్య :

చైల్డ్ ఆర్టిస్ట్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేసిన బాల ఆదిత్య, హీరోగా, సీరియల్ నటుడిగా కూడా చేశారు. కొన్నాళ్లుగా నటనకు దూరమైన బాల ఆదిత్య రోజుకు రూ.35 వేలు తీసుకుంటున్నారట.

11. మరీనా & 12. రోహిత్

ఈ సీజన్ లో సెలబ్రిటీ కపుల్ గా ఎంట్రీ ఇచ్చారు సీరియల్ నటులు మరీనా, రోహిత్. ఈ భార్య భర్తలు ఇద్దరు రోజుకు చెరో రూ.40 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారట.

13. వాసంతి కృష్ణన్ :

సీరియల్ నటి వాసంతి కృష్ణన్ రోజుకు రూ.25 వేల పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.

14. షాని :

సై ఫేమ్ షాని సైతం పర్ డే రూ.30 వేల ఇచ్చే ఒప్పందంపై హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడట. షాని కొన్నాళ్లుగా ఆఫర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు.

15. ఆర్జే సూర్య :

ఇక ఆర్జే సూర్య పారితోషికం రోజుకు రూ.40 వేలని సమాచారం. పెద్దగా పాపులారిటీ లేని సూర్య రోజుకు ఇంత మొత్తంలో తీసుకుంటున్నాడంటే విశేషం.

16. ఆది రెడ్డి :

యూట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూలు చెబుతూ ఫేమస్ అయ్యాడు ఆదిరెడ్డి. ఈ యూట్యూబర్ రోజుకు రూ.30 వేలు అందుకుంటున్నాడట.

17. ఆరోహి రావు :

యాంకర్ ఆరోహి రావు అందరికంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమెకు రోజుకు కేవలం రూ.15 వేలు ఇస్తున్నారట.

18. ఫైమా :

‘జబర్దస్త్’ కమెడియన్ అయిన ఫైమాకి రోజుకి రూ.25 వేలు ఒప్పందంపై హౌస్ లో అడుగుపెట్టిందట. 30 ఏళ్లుగా అద్దె ఇంటిలో ఉంటున్న తల్లి కోసం ఇల్లు కొనడమే ధ్యేయం అని ఫైమా చెబుతుంది.

19. రాజశేఖర్ :

ప్రముఖ మోడల్, నటుడైన రాజశేఖర్ కు రోజుకు రూ.20 వేల పారితోషికం ఇస్తున్నారట.

20. ఇనయా సుల్తానా :

నటి ఇనయ సుల్తానా కి ఒక్కో రోజుకు గాను కేవలం రూ.15 వేలు పారితోషికం మాత్రమే ఆఫర్ చేశారట. వర్మతో కనిపించి ఫేమస్ అయిన ఇనయాకు పెద్దగా ఫేమ్ లేదు. ఆ కారణంతోనే ఆమెకు అంత తక్కువ ఇస్తున్నారు.

21. రేవంత్ :

కాగా బిగ్ బాస్ సీజన్ 6 లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సెలబ్రిటీ సింగర్ రేవంత్. ఇండియన్ ఐడల్ కూడా గెలిచిన రేవంత్ కి బిగ్ బాస్ నిర్వాహకులు రోజుకు రూ. 60 వేలు ఇస్తున్నారట.

Tags