Lavanya Tripathi- Chiranjeevi: లైఫ్ ఈజ్ అన్ సర్టైన్… అంటారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అలాగే కలలో కూడా జరగవు అనుకున్నవి కూడా జరగొచ్చు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి జీవితంలో అలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. యూపీకి చెందిన లావణ్య తెలుగింటి కోడలు అవుతుందని ఊహించి ఉండదు. అలాగే యాదృచ్చికంగా అనుకున్న కొన్ని ఘటనలు ఆమె జీవితంలో నిజం అయ్యాయి. చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న అల్లు అరవింద్… తెలుగు అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అన్నాడు.
అల్లు అరవింద్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయినే పెళ్లి చేసుకుని ఆయన జోక్ ని నిజం చేసింది లావణ్య. ఇలాంటిదే మరొక కోఇన్సిడెంట్ ఆమె జీవితంలో ఉంది. లావణ్య త్రిపాఠి సినిమాలో చెప్పిన డైలాగ్ ఆమె జీవితంలో నిజంగానే జరిగింది. లావణ్య త్రిపాఠి డెబ్యూ మూవీ ‘అందాల రాక్షసి’. దర్శకుడు హను రాఘవపూడి ఎమోషనల్ ట్రైయాంగిల్ లవ్ డ్రామాగా తెరకెక్కించాడు.
ఈ మూవీలో లావణ్య వద్దకు చిన్నపిల్లలు వచ్చి… అక్కా నీ పెళ్ళికి సినిమా హీరోలు వస్తారట కదా? చిరంజీవి కూడా వస్తున్నారా?, అని అడుగుతారు. అవునని లావణ్య త్రిపాఠి సమాధానం చెబుతుంది. గ్యాంగ్ లీడర్ పెళ్ళికి వస్తున్నాడంట అని పిల్లలు అల్లరి చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. 2012లో విడుదలైన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య చెప్పిన డైలాగ్ నిజమైంది. లావణ్య పెళ్ళికి చిరంజీవి వచ్చాడు. చెప్పాలంటే మెగా హీరోలందరూ హాజరయ్యారు.
ఆమె మెగా కోడలు కావడమే ఇందుకు కారణం. లేదంటే లావణ్య పెళ్ళికి చిరంజీవి రావడం అసాధ్యం. ఒకవేళ లావణ్య యూపీకి చెందిన అబ్బాయినో, ముంబై వ్యాపారవేత్తనో చేసుకుంటే అది సాధ్యం అయ్యేది కాదు. లావణ్య కోసం దర్శకుడు రాసిన డైలాగ్ తథాస్తు దేవతలు విన్నట్లు ఉన్నారు. ఆమెను కొణిదెల వారి ఇంటికి కోడలిగా పంపారు. ఐదేళ్లకు పైగా ప్రేమించుకుంటున్న లావణ్య-వరుణ్ వివాహం నవంబర్ 1న ఇటలీ దేశంలో జరిగింది.