https://oktelugu.com/

Samantha-Lavanya Tripathi : సమంత బాటలోనే లావణ్య త్రిపాఠి కూడా..!

లావణ్య సినిమాలు చేయాలని నిహారిక గట్టిగా కోరుకుంటుందని ఆమె మాటల్ని బట్టి అర్థం అవుతుంది. మరి లావణ్య సినిమాలు చేస్తే... ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారో చూడాలి.

Written By:
  • S Reddy
  • , Updated On : February 8, 2024 / 08:39 PM IST
    Follow us on

    Samantha-Lavanya Tripathi : నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ని వివాహం చేసుకుంది. గత ఏడాది నవంబర్ లో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీ దేశంలో ఘనంగా జరిగింది. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కాగా పెళ్ళయాక లావణ్య నటనకు గుడ్ బై చెబుతారని అందరూ భావించారు. అయితే ఆమె నటనను కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆల్రెడీ లావణ్య మిస్ పర్ఫెక్ట్ పేరుతో ఒక వెబ్ సిరీస్ చేశారు. అది ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఓ తెలుగు సినిమాకు ఆమె సైన్ చేశారట.

    లావణ్య నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లే. దీంతో లావణ్య త్రిపాఠి కూడా సమంతను ఫాలో అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సమంత కూడా పెళ్లి తర్వాత చిత్రాలు చేశారు. ఆమె ఏకంగా బోల్డ్ సీన్స్ లో సైతం నటించడం విశేషం. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో అయితే కొన్ని దారుణమైన సన్నివేశాల్లో సమంత మొహమాటం లేకుండా నటించింది. అక్కినేని ఇంటి కోడలు అయ్యుండి అలాంటి పాత్రల్లో నటించడం అటు ఫ్యాన్స్ ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదని తెలిసింది.

    సమంత సినిమాల్లో నటించడం వలనే సమస్యలు వచ్చాయనే వాదన కూడా ఉంది. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి నటన కొనసాగించడం ఆందోళన కలిగిస్తుంది. లావణ్య నిర్మాతగా మారాలని అనుకుంటున్నారని గతంలో కథనాలు వెలువడ్డాయి. అలా చేసినా బాగుండు. నటన మాత్రం వద్దని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    ఇటీవల నిహారిక ఇదే విషయంపై కామెంట్స్ చేశారు. అసలు పెళ్ళికి ప్రొఫెషన్ కి సంబంధం ఏమిటీ? పెళ్ళైతే సినిమాలు మానేయాలా? అని ఆమె అన్నారు. మా వదిన లావణ్యను కూడా చాలా మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. లావణ్య సినిమాలు చేయాలని నిహారిక గట్టిగా కోరుకుంటుందని ఆమె మాటల్ని బట్టి అర్థం అవుతుంది. మరి లావణ్య సినిమాలు చేస్తే… ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారో చూడాలి. హోమ్లీ రోల్స్ చేస్తూ, గ్లామర్ యాంగిల్ వదిలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.