
ఏ మాత్రం అదృష్టం లేని హీరోయిన్ అంటే ‘లావణ్య త్రిపాఠి’నే. గ్లామర్ విషయంలో ఈ సొట్టబుగ్గల సుందరి ఇప్పడున్న చాలామంది స్టార్ హీరోయిన్స్ కంటే, చాల వాటిల్లో చాల బెటర్. అయినా ఎందుకో చిన్న హీరోయిన్ గానే మిగిలిపోయింది. హీరోయిన్ గా కేరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటుతున్నా… ఇంకా కొత్త హీరోయిన్ కి ఉన్న స్టార్ డమ్ కూడా లేక లోలోపల కుమిలిపోతుంది.
దీనికి తోడు ప్రతి చిన్నాచితకా హీరో కూడా ఇప్పుడు హీరోయిన్ అంటే.. లావణ్య వైపే చూస్తున్నాడట. ‘అసలు నాకు ఆఫర్లు రాకపోయినా హ్యాపీగా ఉంటాను గాని, ఊరుపేరు లేనోడు కూడా తన పక్కన నన్ను హీరోయిన్ గా అడుగుతుంటే చాల బాధగా ఉంది’ అంటూ లావణ్య తన సన్నిహితుల చెప్పుకుని తెగ ఫీల్ అయిపోతుందట. దీనికితోడు అడ్రెస్ లేనోడు కూడా లావణ్య పై సోషల్ మీడియాలో కాంట్రవర్సీల కామెంట్స్ చేస్తున్నారు.
అందుకే, ఆమె తన సినీ కెరీర్ పై సీరియస్ గా ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఇక తానూ ఇండస్ట్రీలో కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఉంటానని.. ఈ లోపు కొన్ని మంచి సినిమాలు చేయాలని ఉందని.. అందుకే అందరి స్టార్ డైరెక్టర్స్ అండ్ స్టార్ హీరోలతో తనకు సూట్ అయ్యే ఆఫర్స్ ఉంటే.. ఇవ్వండి అని అడగాలని అమ్మడు ఫిక్స్ అయిపోయింది.
మరి లావణ్యకు అవకాశాలు ఇస్తారా ? నిజానికి లావణ్య కెరీర్ మొదట్లోనే ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. అప్పుడు తెలిసీ తెలియక వాటిని దూరం చేసుకుని.. మొత్తానికి కెరీర్ నే పోగొట్టుకుంది. లేకపోతే.. ‘గీతగోవిందం’ లాంటి హిట్ సినిమాని ఏ హీరోయిన్ వదులుకుంటుంది. పాపం లావణ్య.