https://oktelugu.com/

Happy Birthday Movie Review: రివ్యూ – హ్యాపీ బర్త్ డే

Happy Birthday Movie Review : నటీనటులు: లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్, నరేగ్ అగస్త్య, గుండు సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు రచన, దర్శకత్వం – రితేష్ రానా. సంగీతం – కాలభైరవ, సినిమాటోగ్రఫీ – సురేష్ సారంగం, నిర్మాణం – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌తో, నిర్మాతలు – చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు, వినూత్న ప్రచార కార్యక్రమాలతో ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ లావణ్య త్రిపాఠి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల […]

Written By:
  • Shiva
  • , Updated On : July 8, 2022 / 03:17 PM IST
    Follow us on

    Happy Birthday Movie Review : నటీనటులు: లావణ్య త్రిపాఠి, సత్య, వెన్నెల కిషోర్, నరేగ్ అగస్త్య, గుండు సుదర్శన్, గెటప్ శ్రీను తదితరులు

    రచన, దర్శకత్వం – రితేష్ రానా.

    సంగీతం – కాలభైరవ,

    సినిమాటోగ్రఫీ – సురేష్ సారంగం,

    నిర్మాణం – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌తో,

    నిర్మాతలు – చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు,

    వినూత్న ప్రచార కార్యక్రమాలతో ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ లావణ్య త్రిపాఠి సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

    Happy Birthday Movie Review

    కథ :

    కేంద్ర మంత్రి రితిక్ సోది (వెన్నెల కిషోర్) పలు విమర్శల మధ్య ఆయుధ వినియోగ సవరణ చట్టాన్ని తీసుకొస్తాడు. ప్రతిఫలంగా వేల కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అందుకుంటాడు. ఆ డబ్బును ఓ స్టార్ హోటల్ లోని లాకర్ లో పెడతాడు. ఆ లాకర్ పాస్ వర్డ్ ను ఒక పెన్ డ్రైవ్ లో సేవ్ చేసి.. చేతులు మార్చాలి అనుకుంటారు. ఇది తెలిసి ( రాహుల్ రామకృష్ణ), హోటల్ వెయిటర్ లక్కీ (నరేష్ అగస్త్య)తో ఆ పెన్ డ్రైవ్ ను దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో ఆ పెన్ డ్రైవ్ ‘హ్యాపీ (లావణ్య త్రిపాఠి)’ హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది ? చివరకు ‘హ్యాపీ’ హ్యాండ్ బ్యాగ్ లోని పెన్ డ్రైవ్ ఎవరికి దొరికింది ?, ఫైనల్ గా ఆ డబ్బు ఎవరు దక్కింది ? అనేది మిగిలిన కథ.

    Also Read: Upasana About Childrens: మేము పిల్లల్ని కనలేకపోడానికి కారణం అతనే

    విశ్లేషణ :

    ఒక కొత్త ఊహా ప్రపంచంలో ఈ కథ, ఈ పాత్రలు సాగుతాయి. ముఖ్యంగా వేల కోట్ల రూపాయల డబ్బు చుట్టూ కథ సాగడం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. పాత్రలు మాట్లాడే డైలాగ్స్, అలాగే నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. దర్శకుడు చాలా కీలక సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే, ఎంత ఫిక్షనల్ వరల్డ్ అయినప్పటికీ.. కథలో లాజిక్స్ మిస్ కాకూడదు.

    Lavanya Tripathi

    మెయిన్ గా లావణ్య త్రిపాఠి ట్రాక్ లో ఎక్కడా లాజిక్ లేదు. కాకపోతే, ఆమె పాత్రకు సంబంధించి ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ ఉంది. ఇక వెన్నెల కిషోర్ పాత్ర కూడా వినోదాన్ని పంచింది. అలాగే, కథలోని కొన్ని అంశాలు అట్టుకున్నాయి. కాకపోతే, స్లోగా నడిచే స్క్రీన్ ప్లే కారణంగా సినిమాకి జ‌ర‌గాల్సిన న‌ష్ట‌మంతా జ‌రిగిపోయింది.

    సింగిల్ ప్లాట్ తోనే ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా మొత్తం సాగడం.. మొత్తమ్మీద ఈ సినిమా అందరికీ కనెక్ట్ కాదు. అసలు ప్రతి పాత్ర ఒకే ఎమోషన్ తో సినిమా చివరి వరకు ఉంటే ఎలా నచ్చుతుంది ? బలమైన సంఘర్షణతో సాగాల్సిన పాత్రలు నిస్సహాయతతో సాగితే, ఆ పాత్రలు ఎప్పటికీ ఎవరికీ కనెక్ట్ కావు. హ్యాపీ బర్త్ డే లో జరిగింది అదే. కానీ ‘లావణ్య త్రిపాఠి’ మంచి నటనను ప్రదర్శించింది.

    Lavanya Tripathi

    ప్లస్ పాయింట్స్:

    లావణ్య త్రిపాఠి నటన

    వెన్నెల కిషోర్

    నేపథ్య సంగీతం,

    సరికొత్త నేపథ్యం

    మైనస్ పాయింట్స్:

    బోరింగ్ ప్లే,

    లాజిక్స్ మిస్ అవ్వడం,

    స్లో సాగే ట్రీట్మెంట్,

    పూర్తి ఊహాజనిత కథ

    సినిమా చూడాలా ? వద్దా ?

    డిఫరెంట్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ కాదు.

    రేటింగ్: 2.5/5

    Also Read:Lavanya Tripathi Assets: లావణ్య త్రిపాఠి ఆస్తులెన్నో తెలుసా..? ఆమె అపార్ట్మెంట్ అంత అంత ఖరీదా ?
    Recommended Videos

    Tags