Homeఎంటర్టైన్మెంట్Lavanya Tripathi: చిరంజీవి గారి గురించి తెలియకపోతే నోరు మూసుకోండి అంటూ లావణ్య త్రిపాఠి హాట్...

Lavanya Tripathi: చిరంజీవి గారి గురించి తెలియకపోతే నోరు మూసుకోండి అంటూ లావణ్య త్రిపాఠి హాట్ కామెంట్స్!

Lavanya Tripathi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన కొడుకు రామ్ చరణ్(Global Star Ram Charan) విషయం లో రెండవ సారి తాత అవ్వడం, ఆయనకు ఈ వయస్సులో ఎంతటి ఆనందాన్ని ఇచ్చి ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఆయన కుటుంబం లో మూడవ తరానికి చెందిన వారంతా ఆడపిల్లలకు జన్మనిచ్చారు. ఒక్క మగబిడ్డ పుడితే బాగుండును అని చిరంజీవి తన కోరిక ని పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ఆయన కోరికకు తగ్గట్టుగానే మొన్న ఉపాసన జన్మనిచ్చిన కవలపిల్లలో ఒక మగబిడ్డ ఉన్నాడు. అయితే చిరంజీవి మగబిడ్డని కోరుకోవడం తో సోషల్ మీడియా లో ఆయనపై కొంతమంది అతి దారుణమైన కామెంట్స్ చేశారు. ఎందుకు మగబిడ్డ కావాలని అంత కోరిక?, కేవలం మగవాడు మాత్రమే వారసుడిగా ఉండాలా?, ఆడవాళ్లు ఉండకూడదా అంటూ ఆయనపై నోరు పారేసుకోవడం మొదలు పెట్టారు. యూట్యూబ్ లో కూడా మిలియన్ల కొద్దీ ‘subscribers’ ఉన్న యూట్యూబర్స్ కూడా ఈ అంశంపై చిరంజీవి ని విమర్శిస్తూ స్పెషల్ వీడియోస్ చేశారు.

చిరంజీవి ఎక్కడా కూడా మగబిడ్డ నే వారసుడు అనే మాట అనలేదు, కేవలం మగబిడ్డని కోరుకున్నాడు అంతే. అదే ఆడబిడ్డ కావాలని కోరుకున్న వాళ్ళని ఇంత టార్గెట్ ఎవరైనా చేస్తారా చెప్పండి?. ఈ సమాజం లో ఆడవాళ్లను, మగవాళ్ళను సమానంగా చూడాలని అంటారు, కానీ ఇలాంటి సందర్భాల్లో మాత్రం ఈ విధంగా విమర్శిస్తుంటారు. అయితే దీనిపై మెగా కోడలు, వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. ప్రముఖ రివ్యూయర్ హరి చరణ్ పూడిపెద్ది కూడా చిరంజీవి వ్యాఖ్యలను ఇలాగే తప్పు బట్టాడు. అతని ట్వీట్ ని క్వాట్ చేస్తూ ‘ సాధారణంగా నా టైం లైన్ పై వచ్చే ఇలాంటి కామెంట్స్ ని నేను పట్టించుకోను, చూసి చూడనట్టు వదిలేస్తాను, కానీ నీ నుండి ఇలాంటి కామెంట్స్ మాత్రం అసలు ఊహించలేదు’.

‘ ఎంతో ఆనందించాల్సిన సమయంలో ఇలాంటి నీచమైన ట్వీట్స్ చూస్తానని అనుకోలేదు. చిరంజీవి గారు మా కుటుంబంలోని ఆడవాళ్లను ఎంత అపురూపంగా చూసుకుంటారో, ముఖ్యంగా తన మానవరాళ్లను ఎంత ప్రేమిస్తారో మీకు తెలియదు. ఆయన చూపించే ప్రేమలో మగవాళ్ళు ఆడబిడ్డలపై ఒక్క శాతం చూపిస్తారని కూడా నేను అనుకోను, కాబట్టి ఆయన గురించి తెలియనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి’ అంటూ చెప్పుకొచ్చింది. అంటే పరోక్షంగా తెలియకపోతే నోరు మూసుకొని మూలాన కూర్చో అన్నట్టుగానే లావణ్య త్రిపాఠి కౌంటర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన ఈ కౌంటర్ పై సోషల్ మీడియా లో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను నేరుగా బూతులు తిట్టినా తప్పులేదంటూ కామెంట్స్ చేసున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఆ ట్వీట్ ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version