Lavanya Tripathi: ప్రేమ పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి పరిచయం అవసరం లేదు. సొట్టబుగ్గల సుందరి మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. వీరిద్దరు ప్రేమించుకున్న కుటుంబ సభ్యుల మధ్య నవంబర్ ఒకటో తేదీన అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి వివాహం కనుల పండుగగా జరిగింది. ఇలా మెగా ఇంటి కోడలిగా అడుగుపెట్టిందో లేదో.. అలా లావణ్య పై కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. లావణ్య, వరుణ్ లు కలిసి మిస్టర్ అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారట.. కానీ ఎవరికి తెలియకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎన్నో సార్లు మీడియాలో ఈ ప్రశ్నలు ఎదురైనా ఇద్దరు కూడా ఈ విషయాన్ని దాటవేశారు కానీ స్పందించలేదు. అయితే రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు నిశ్చితార్థం తేదీని ప్రకటించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని మెగా అభిమానులకు పండుగ వాతావరణాన్ని తెచ్చారు. అలాంటి ఈ జంటపై మరొక వార్త వైరల్ గా మారింది. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడం కామన్. అయితే లావణ్య మాత్రం పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుందట.
ఇదివరకే మెగా కోడలిగా అడుగుపెట్టిన ఉపాసన పిల్లల విషయంలో ఎన్నో విమర్శలు, ప్రశ్నలను ఎదుర్కొంది. వివాహం జరిగిన 10 సంవత్సరాలకు వీరికి పిల్లలు పుట్టారు. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి కూడా కెరీర్ పరంగా ఎన్నో డ్రీమ్స్ ఉన్నాయట. ఆ డ్రీమ్స్ ఫిల్ అయిన తర్వాతనే పిల్లలను కనాలని ఆలోచిస్తుందట. ఈమె ఓ షోరూం ప్రారంభం చేసి అతి తక్కువ ధరకే ఫ్యాషన్ దుస్తులను అందరికీ అందుబాటులోకి తేవాలని భావిస్తుందట. మరోవైపు సినిమా ఫీల్డ్ లో కూడా కంటిన్యూ అవుతందనే టాక్ వినిపిస్తుంది. ఓ ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్టాట్ చేయాలని ఫిక్స్ అయిందట. ఇలా కెరీర్ ను ఫుల్ ఫిల్ చేసుకున్నాకే పిల్లల గురించి ఆలోచించాలి అనుకుంటుందట మెగా ఫ్యామిలీ కొత్త కోడలు.
ఈమె పిల్లల పట్ల తీసుకున్న ఈ నిర్ణయం గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ సాగుతుంది. ఉపాసన 10 సంవత్సరాలకు ప్లాన్ చేస్తే మీరు 20 సంవత్సరాలకు చేసుకోండి అని కొందరు, అక్క బాటలో నడుస్తున్న చెల్లెలు అని మరికొందరు కామెంట్లు చేస్తుంటే.. అయినా వారి వ్యక్తిగత జీవితం పూర్తిగా వారి ఇష్టం అని మెగా అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. మరి చూడాలి ఈ విషయం పై ఎప్పుడు క్లారిటీ రానుంది అనేది…