https://oktelugu.com/

Varun Tej: అవును నా భార్య లావణ్య సినిమాలు చేస్తుంది, వరుణ్ తేజ్ సంచలన ప్రకటన

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గర్భం దాల్చారంటూ ఒక ప్రక్క పుకార్లు చక్కర్లు కొడుతున్న తరుణంలో ఆమె రీఎంట్రీకి సిద్ధమని వరుణ్ ప్రకటించడం సంచలనంగా మారింది. లావణ్య త్రిపాఠి కథలు వింటుందట. ఆమె సినిమాలు చేయనుందట. ఈ మేరకు వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : November 13, 2024 / 06:49 PM IST
    Follow us on

    Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ కి అర్జెంట్ గా ఒక హిట్ కావాలి. వరుణ్ కెరీర్ బిగినింగ్ నుండి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. స్టార్ కావాలని ఆయన కమర్షియల్ సబ్జక్ట్స్ వెనకపడలేదు. ఇతర యంగ్ హీరోలకు భిన్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలో ఆయనకు విజయాలు పరాజయాలు ఎదురయ్యాయి. కాగా వరుణ్ తేజ్ కి క్లీన్ హిట్ పడి చాలా కాలం అవుతుంది. ఆయన గత రెండు చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి. ఈసారి ఆయన పీరియాడిక్ యాక్షన్ క్రైమ్ డ్రామా ఎంచుకున్నాడు.

    మట్కా చిత్రంతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. మట్కా చిత్రానికి కరుణ కుమార్ దర్శకుడు. పలాస చిత్రంతో కరుణ కుమార్ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. మట్కా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మట్కా నవంబర్ 14న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీ భార్య లావణ్య త్రిపాఠి మరలా నటిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగారు.

    లావణ్య త్రిపాఠి కథలు వింటుంది. త్వరలో సినిమాలు చేస్తుంది. కాకపోతే ఒకప్పుడు తనకు వచ్చిన ప్రతి సినిమా చేస్తూ పోయేది. పాత్రకు ప్రాధాన్యత ఉన్నా లేకున్నా నటించేది. ఇప్పుడు ఆమె కంఫర్ట్ జోన్లో ఉంది. ఏ సినిమా పడితే అది చేయాల్సిన అవసరం లేదు. ఇక మేమిద్దరం జంటగా నటించాలి అంటే మంచి కథ దొరకాలి. స్క్రిప్ట్ నచ్చితే ఖచ్చితంగా చేస్తాము.

    పెళ్ళయ్యాక సినిమాలు చేయకూడదు అనే మైండ్ సెట్ ఇప్పుడు జనాల్లో లేదు. అది మారిపోయింది. వివాహం అనంతరం కూడా సినిమాలు చేయవచ్చు. లావణ్య కూడా సినిమాలు చేస్తుంది, అని వరుణ్ తేజ్ అన్నారు. మెగా ఫ్యామిలీ అడ్డు చెప్పడం వలనే లావణ్య నటనకు గుడ్ బై చెప్పిందనే పుకార్ల నేపథ్యంలో వరుణ్ తేజ్ కామెంట్స్ చెక్ పెట్టాయి.

    గత ఏడాది నవంబర్ 5న వరుణ్-లావణ్య వివాహం చేసుకున్నారు. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. 2017లో విడుదలైన మిస్టర్ మూవీలో వరుణ్, లావణ్య జంటగా జంటగా నటించారు. అప్పుడు మొదలైన పరిచయం ప్రేమకు దారి తీసింది. చాలా కాలం రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. లావణ్య అందాల రాక్షసి, సోగ్గాడే చిన్ని నాయనా, భలే భలే మగాడివోయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.