
టాలీవుడ్ క్రేజీ కాంబోల్లో.. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి మూవీ ‘అతడు’ ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సైలెంట్ వచ్చి, మాసివ్ హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘ఖలేజా’ కూడా ప్రేక్షకులను అలరించింది. అయితే.. వీరి హ్యాట్రిక్ మూవీ వస్తే చూడాలని ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఆశపడుతున్నారు. కానీ.. ఖలేజా విడుదలై పదేళ్లు దాటిపోయినప్పటికీ.. సినిమా మాత్రం రాలేదు.
అయితే.. మహేష్ – త్రివిక్రమ్ మూడో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు.. ఈ మూవీని త్వరగా అనౌన్స్ చేయాలని కూడా మహేష్ పట్టుబడుతున్నాడట. అయితే.. త్రివిక్రమ్ మాత్రం వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నాడని, దీనికి కారణమేంటని ఆరాతీస్తే రాజమౌళిని చూపిస్తున్నాడని సమాచారం!
అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం ఏడాదికి పైగా వెయిట్ చేస్తున్నాడు దర్శకుడు. కానీ.. RRR సెట్ నుంచి మాత్రం బయటకు రావట్లేదు జూనియర్. కరోనా, ఇతర కారణాలతో ఏకంగా మూడు సార్లు రిలీజ్ వాయిదా పడిందీ చిత్రం. అది పూర్తయిన తర్వాతనే.. త్రివిక్రమ్ మూవీ మొదలవుతుంది.
ఇదిలాఉంటే.. మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్నది క్లారిటీ లేదు. మొదలైన తర్వాత ఎప్పుడు పూర్తవుతుందన్నది కూడా ఎవరూ చెప్పలేరు.
అందువల్ల.. ఈ విషయంలో రాజమౌళి నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే మహేష్-త్రివిక్రమ్ మూవీ అనౌన్స్ చేస్తారని సమాచారం. జక్కన్న లాంగ్ గ్యాప్ తీసుకుంటే ముందుగా.. వెంటనే మొదలు పెడితే.. ఆ తర్వాత వీరి హ్యాట్రిక్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.