Harish Shankar: స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హిందీలో తన తొలి మూవీని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాను హరీశ్ హిందీలో రీమేక్ చేయనున్నాడట. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడని టాక్. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ యంగ్ హీరో నటించనున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం అయితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పట్ల పవన్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. హరీష్ తో సినిమా అంటే.. అభిమానులకు పండగే. ఎందుకంటే.. ఒక అభిమాని పవన్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. హరీష్, పవన్ తో సినిమా చేస్తే అలా ఉంటుంది. అందుకే, వీరి కలయికలో వచ్చే సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అన్నట్టు తాజాగా ఈ సినిమా పై పవన్ నుంచి క్లారిటీ వచ్చింది.
Also Read: లవ్లీ భర్తతో ఫస్ట్ ట్వీట్ అంటూ ఎన్టీఆర్ సతీమణి !
క్లారిటీ అంటే, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాల్లో అన్నమాట. ఫిబ్రవరి మూడో వారం నుంచి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అలాగే రిలీజ్ విషయానికి వస్తే.. 2023 సంక్రాంతికి హరీష్ శంకర్ – పవన్ తమ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

పైగా ఈ సినిమాలో వెరీ పవర్ ఫుల్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు. ముఖ్యంగా పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. అంటే.. తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. తన తండ్రి మరణానికి కారణం అయిన వాళ్ల పై హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కోణంలో కథ సాగుతుంది.
Also Read: కొత్త జిల్లాలతోనే ఏపీకి మూడు రాజధానులు!
[…] Tollywood Crazy Updates: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే… అందం, అభినయంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్. స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ భామ. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రమైన సలార్ మూవీలో ప్రభాస్ సరసన నటిస్తుంది. అయితే మరోవైపు శ్రుతి ఓ వెబ్ సిరీస్లోను నటిస్తోంది.ఈ వెబ్ సిరీస్కు బెస్ట్ సెల్లర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అమెజాన్ లో ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 18న రిలీజ్ కానుంది. […]