S. S. Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తన ఔదార్యం చాటుకున్నారు. బాహుబలి సినిమాకు పని చేసిన దేవిక అనే మహిళకు అండగా నిలిచారు. క్యాన్సర్ మహమ్మారితో బాధపడుతున్న ఆమెకు సహాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. సదరు మహిళ గురించి రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. హైదరాబాద్ కి చెందిన దేవిక పోస్ట్ ప్రొడక్షన్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. ఆమె బాహుబలి సినిమాకు కూడా పనిచేశారు.

దేవిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. ఆమె పెద్ద కుమారుడు అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. భర్త కిడ్నీ సంబంధిత వ్యాధితో కన్నుమూశాడు. కుటుంబ పోషణ భారం దేవిక పైనే పడింది. ఈ క్రమంలో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ఒకసారి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్న దేవికకు మరలా క్యాన్సర్ తిరగబెట్టింది. వైద్యం చేయిస్తే తిరిగి కోలుకునే అవకాశం కలదు. అయితే వైద్యానికి ఏకంగా రూ 3 కోట్ల రూపాయలు కావాలి. ఓ మధ్య తరగతి మహిళగా ఆమె వద్ద అంత అమౌంట్ ఉండే అవకాశం లేదు.
Also Read: పెండ్లిలో చిచ్చు రేపిన పూలదండ.. చివరకు ఇంత దారుణమా..!
దీనితో దేవిక ఓ ఫౌండేషన్ ని సంప్రదించారు. కెట్టొ ఆర్గనైజేషన్ అనారోగ్యం బారినపడిన పేదల కోసం ఫండ్స్ రైజ్ చేస్తుంది. దేవిక వైద్యానికి అవసరమైన ఫండ్స్ కూడా కెట్టొ ఆర్గనైజేషన్ కలెక్ట్ చేస్తుంది. ఈ క్రమంలో రాజమౌళి సదరు మహిళకు సహాయం చేయాలంటూ ట్విట్టర్ వేదికగా కోరుతున్నారు. ప్రొడక్షన్ కోఆర్డినేటర్ గా దేవిక పనితీరు అద్భుతం. బాహుబలి మూవీ సమయంలో ఆమెతో కలిసి పనిచేశాను. ఆమె పరిస్థితి అర్థం చేసుకొని దేవిక వైద్యానికి అవసరమైన ఫండ్స్ డొనేట్ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు.

రాజమౌళి చొరవతో దేవిక గురించి అందరికీ తెలిసింది. దేవిక క్యాన్సర్ చికిత్సకు కావలసిన రూ. 3 కోట్లు డొనేషన్స్ సమకూరుతాయనే నమ్మకం ఏర్పడింది. పాన్ ఇండియా దర్శకుడిగా క్షణం తీరిక లేకుండా గడిపే రాజమౌళి ఓ మహిళ ప్రాణాల కోసం ఇలా చొరవ తీసుకోవడం ఆయన మంచి మనసుకు నిదర్శనం.
మరోవైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా ఆంక్షల కారణంగా పోస్ట్ ఫోన్ అయ్యింది. ఇక ఆర్ ఆర్ ఆర్ కొత్త విడుదల తేదీలుగా రెండు ప్రకటించారు. మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 తేదీలలో ఆర్ ఆర్ ఆర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీపై దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొని ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలు చేస్తున్నారు.