Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి ఒక లవ్ సాంగ్ రాబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా అనేక రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ అప్ డేట్ రివీల్ అయింది. ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయింది.

కాగా.. మే 12న విడుదల చేస్తామని తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే అప్పటివరకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ను అలరిస్తామని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పాడు. అందులో భాగంగా వాలంటైన్స్ డే సందర్భంగా ఈనెల 14న సర్కారు వారి పాట నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని ప్రకటించి మూవీ పై హైప్ క్రియేట్ చేశాడు.
Also Read:మహేష్ కి పోటీగా గోపీచంద్ నిలబడగలడా ?
మొత్తానికి ముందే ఊహించినట్టుగా ఈ సినిమా నుంచి వాలంటైన్స్ డే స్పెషల్‌గా ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఈ సాంగ్ చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లవ్ సాంగ్ ను చంద్రబోస్ రాశారు. ఈ లవ్ సాంగ్ లిరిక్స్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయట. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా రానున్న ఈ ఫస్ట్ సింగిల్ లో ప్రేమికుల దినోత్సవం గొప్పతనాన్ని కూడా ఎలివేట్ చేస్తారట.

అన్నట్టు ఈ సాంగ్ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపిస్తాడట. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉంది.