Shiva Rajkumar: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పాత్రకు ‘జేమ్స్’ సినిమాలో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టమైందని అతడి సోదరుడు, నటుడు శివరాజ్‌కుమార్ అన్నాడు. ‘డబ్బింగ్ చెప్పే సమయంలో స్క్రీన్ మీద నా సోదరుడు రాజ్‌కుమార్‌ను చూస్తుంటే నాకు మానసికంగా చాలా కష్టంగా అనిపించింది’ అని శివకుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. సినిమా మధ్యలోనే కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించడంతో ఆ పాత్రకు శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పాడు.

ఇక కన్నడ పవర్ స్టార్ గా పునీత్ రాజ్ కుమార్ ఎదిగి, తన తండ్రి రాజ్ కుమార్ కి నిజమైన వారసుడిగా కన్నడనాట గొప్ప స్టార్ డమ్ సంపాదించాడు. అయితే, కన్నడ పవర్ స్టార్ గా మారడానికి పునీత్ జీవితం క్రమశిక్షణతో సాగింది. అందుకే, పునీత్ రాజ్‌కుమార్ కన్నడ ఇండస్ట్రీలోనే పవర్ స్టార్ గా నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. అన్నిటికి మించి కన్నడ ఇండస్ట్రీలో డ్యాన్స్ లను, ఫైట్స్ లను ఓ స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత పునీత్ రాజ్ కుమార్ కే దక్కింది. కన్నడలో ఈ జనరేషన్ హీరోల్లో పునీత పేరిట ఉన్న రికార్డ్స్ మరో హీరోకి లేవు.
Also Read: మహిళ ప్రాణాల కోసం రాజమౌళి చొరవ..!
పునీత్ పేరిట నాలుగు కన్నడ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. పైగా పునీత్ నటించిన అప్పు, నట సార్వభౌమ, మైత్రి, పవర్ ఈ నాలుగు చిత్రాలు కన్నడలో గొప్ప చిత్రాలుగా నిలిచిపోయాయి. ఇక పునీత్ తెలుగు నటులు అన్నా, తెలుగు టెక్నీషియన్స్ అన్నా ఎంతో గౌరవంగా చూసేవాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను తన సొంత తమ్ముడిలా పునీత్ ఫీల్ అయ్యేవాడు.

ఇక పునీత్ కెరీర్ లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. 1985లోనే ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి, ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెల్చుకున్నాడు. ఈ ఘనత ఇప్పటికీ గొప్ప రికార్డ్ గానే మిగిలిపోయింది.