Buchi Babu: ‘ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం’ అన్నాడట వెనకటికి ఒకడు. అలా ఉంది బుచ్చిబాబు వ్యహారం. ఎన్టీఆర్ తో సినిమా అంటూ తనకు తానే ఒక చిన్న గాసిప్ వదిలాడు. ఆ గాసిప్ కాస్త వైరల్ అయ్యి.. చివరకు సినిమా టైటిల్ కూడా ఫిక్స్ అయ్యే వరకు వెళ్ళింది. అసలు పుకార్లకు తెలుగు నెల పుట్టినిల్లులా అయిపోయింది. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లకు అసలు అడ్డు అదుపు లేకుండా పోయింది.

అరె.. అసలు ఎవ్వడు అండి ఈ బుచ్చి బాబు ? హా..? ఎన్టీఆర్ తో సినిమా ఓకే అయింది అనగానే ఎలా నమ్ముతారు ? అంటే.. ఈ పుకార్ల రాయుళ్లకు కనీస అవగాహన కూడా లేదు అనుకోవాలా ? బుచ్చి బాబు డైరెక్టర్ గా తీసింది ఒక సినిమా. ఆ తొలి సినిమా ‘ఉప్పెన’ కూడా గొప్ప సినిమా ఏమి కాదు. కానీ హిట్ అయింది. హిట్ కొట్టిన బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా అంటూ వార్తలు వదిలారు.
Also Read: హ్యాట్రిక్ సీఎం కావాలంటున్న కేసీఆర్.. రంగంలోకి దిగిన పీకే షాడో బృందం!
వదిలితే వదిలారు, దాన్ని కంటిన్యూ చేస్తూ.. వీరి కలయికలో చేస్తున్న సినిమాకి ఆసక్తికరమైన టైటిల్ ఫిక్సయినట్లు మళ్ళీ పుకార్లు పుట్టించారు. ఇంతకీ టైటిల్ ఏమిటి అనుకుంటున్నారు ? ‘పెద్ది’ అనే టైటిల్ ఖరారు చేశారట. అసలు ఎన్టీఆర్ కి ఇలాంటి టైటిల్ ఏ బుద్ది తక్కువ దర్శకుడు అయినా పెడతాడా ? అయినా, నిజానిజాలు తెలుసుకోకుండా అక్కడ ఇక్కడా కాపీ కొట్టి రాసే దౌర్భాగ్యపు కాపీ గాళ్ళు కంటెంట్ రైటర్లుగా ఉన్నంత కాలం ఇలాంటి చౌకబారు వార్తలే వస్తాయి.

పైగా ఈ సినిమాకి ఒక నేపథ్యాన్ని కూడా అల్లేశారు. 1980 కాలపు స్పోర్ట్స్ డ్రామా కథ అట. 1980లో అసలు అంత గొప్ప యాక్షన్ సినిమా తీసే కథ.. ఏ స్పోర్ట్స్ డ్రామాలో ఉంది ? సరే.. ఉంది అనుకుందాం ? ఈ ‘పెద్ది’ అనే టైటిల్ కి స్పోర్ట్స్ డ్రామా అనే నేపథ్యానికి ఏమైనా సంబంధం ఉందా ?
ఇక చివరగా ఈ చిత్ర లాంఛింగ్ సమయాన్ని కూడా త్వరలో వెల్లడిస్తారట. మరి ఈ సంగతి ఎన్టీఆర్ కి అయినా చెబుతారో ? లేదో ?, పాపం ఈ ఫేక్ వార్తల్లోకి మైత్రి మూవీ మేకర్స్ ను కూడా లాగారు. మైత్రి ఈ సినిమా నిర్మిస్తోందట.
Also Read: ఆ హీరోయిన్ కోటి ఇస్తేనే ‘ఊ’ అంటుందట !
[…] Also Read: ప్చ్ బుచ్చిబాబు.. ఆలు లేదు, చూలు లేదు క… […]