Nandamuri Balakrishna: ‘బాలయ్య బాబు’ వయసు ప్రస్తుతం 61 సంవత్సరాలు. సహజంగా 60 దాటాక ఏ హీరో అయినా రిస్కీ షాట్స్ చెయ్యడు. డ్యాన్స్, ఫైట్స్ అంటూ ప్రయోగాల జోలికి పోడు. కానీ, బాలయ్య వేరు. బాలయ్య సినిమాలు లాగే, ఆయన స్వభావం కూడా ఎప్పుడు దూకుడుగానే ఉంటుంది. మొదటి నుంచీ బాలయ్యది విభిన్నమైన శైలే, బాలయ్య ప్రవర్తనకి ఓ వైవిధ్యమైన నైజం ఉంది. అందుకే, బాలయ్య ప్రత్యేకమైన వ్యక్తి అయ్యాడు.

దీనికితోడు.. బాలయ్య చేసిన ‘అన్ స్టాపబుల్ షో’ ప్రపంచానికి బాలయ్యలోని మరో వ్యక్తిని పరిచయం చేసింది. ‘బాలయ్య ఇలా ఉంటాడా ? బాలయ్యలో ఇంత మంచితనం ఉందా ?’ అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. బాలయ్య వ్యక్తిత్వం జనానికి బాగా నచ్చింది. ఈ షో తర్వాత బాలయ్య క్రేజ్ నేషనల్ రేంజ్ లో పాకింది. బాలయ్యకి అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. బాలయ్య ఆలచనలో డ్రామాలు ఉండవు. మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు అంటాడు. పైగా సేవలోనూ సాయంలోనూ బాలయ్య మంచితనం జనం నరాల్లో బాగా చొచ్చుకుపోయింది.
Also Read: చేపలు తింటే ఆ సమస్య జీవితంలో రాదట.. ఎన్నో లాభాలంటూ?
అందుకే, అరవై ఏళ్ల వయసులో బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు.
బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఒక స్టార్ హీరోకి రెమ్యునరేషన్ తో పాటు అదనపు ఖర్చులు కూడా భారీగా ఉంటాయి. ఐతే, బాలయ్యకు అవేమి ఉండవు. పైగా బాలయ్య ముందు ఆలోచించేదే నిర్మాత గురించి. నిర్మాత లాభం కోసం, బాలయ్య అర్ధరాత్రులు కూడా పని చేసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే, బాలయ్య డేట్లు కోసం ఇప్పుడు అందరూ ఎగబడుతున్నారు.
ప్రస్తుతం ఫిక్స్ అయిన బాలయ్య సినిమాల లిస్ట్ చూస్తే..
బాలయ్య – గోపీచంద్ మలినేని :

నట సింహం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది. పైగా ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు.
బాలయ్య – అనిల్ రావిపూడి :

టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే తీయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. బాలయ్యతో సినిమా అంటే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.
బాలయ్య – పూరి :

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి బాలయ్య డేట్లు ఇచ్చాడు. పూరితో చేయబోయే సినిమా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని.. బాలయ్య ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి మొదలు కానుంది.
ఇక బాలయ్యతో భవిష్యత్తులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నిర్మాతలు, దర్శకులు లిస్ట్ !
నిర్మాత దిల్ రాజు, బాలయ్య హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ ‘శ్రీకాంత్ అడ్డాల’తో చర్చలు జరుపుతున్నాడు. దాదాపు ఈ కలయికలో సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అలాగే బాలయ్యతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోన్న నిర్మాణ సంస్థలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, మరియు నిర్మాత సి. కళ్యాణ్ బాలయ్య డేట్లు కోసం క్యూలో ఉన్నారు.
అన్నట్టు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తి అవ్వగానే బాలయ్యతో సినిమా స్టార్ట్ చేస్తాడట. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా ఇప్పటికే పూర్తి అయిందని తెలుస్తోంది.
ఇక సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు, డైరెక్టర్ శ్రీవాస్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్, ప్రవీణ్ సత్తారు వంటి డైరెక్టర్లు కూడా బాలయ్యతో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలయ్య వీళ్లకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు.
నిజానికి స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలనే కాన్సెప్ట్ కి బాలయ్య పూర్తి వ్యతిరేకం. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే.. హిట్ వస్తోంది అని తెలిసినా.. తనకు నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్టు అందుబాటులో ఉన్న డైరెక్టర్లతోనే బాలయ్య ఇన్నాళ్లు సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లే బాలయ్య కోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి.. ముందుగా వాళ్ళతోనే బాలయ్య వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు.
Also Read: సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు !