Naga Chaitanya: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య – స్టార్ హీరోయిన్ సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై లోతుగా మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడలేదు. అయితే, ఈ విషయం పై చైతు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం. నేను హ్యాపీగా ఉన్నాను, మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు క్లారిటీ ఇచ్చాడు.

కాగా సామ్ తో విడిపోయాక, చైతు నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఈ అక్కినేని హీరో సంతోషంగా కొత్త బిజినెస్ కూడా షురూ చేశాడు. చైతు రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ-ఏపీలో ఉన్న యూకే హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్‌తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: రోజా రాజీనామాకు రెడీయేనా?
‘షోయూ’ పేరుతో చైతన్య, అతని స్నేహితుడు ఈ పాన్ ఏషియన్ డెలివరీ బ్రాండ్ రెస్టారెంట్ స్టార్ట్ చేసినట్లు ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇక ‘బంగార్రాజు’తో ప్రేక్షకుల్ని అలరించిన నాగచైతన్య.. ఇప్పుడు మరో సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చైతూ హీరోగా నటిస్తున్న ‘థాంక్యూ’ మూవీ చిత్రీకరణ.. శుక్రవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.

కాగా ఈ సినిమాలో చైతన్య సరసన రాశీఖన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తుండగా, దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
Also Read: చత్రపతి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?