OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సినీ నటి అక్కినేని అమల ప్రభుత్వ పాఠశాలకు రూ.50,000 ఆర్థిక సాయం చేశారు. NZB జిల్లా బోధన్ మం. ఖంద్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు అమల రూ.50 వేలు ఇచ్చారని హెడ్మాస్టర్ సంజీవ్ తెలిపారు. గతంలో గ్రామంలో పెళ్లికి వచ్చినప్పుడు స్కూల్ గురించి గ్రామస్థులు అమలకు చెప్పారని పేర్కొన్నారు. దాతలు ఇచ్చిన రూ.2.50 లక్షలతో పనులు చేపట్టామని చెప్పగా, తాను కూడా రూ.50,000 ఇస్తానని మాటిచ్చి, ఇప్పుడు నెరవేర్చారని తెలిపారు.

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. కణం మూవీ షూటింగ్‌లో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ మూడేళ్ల కిందట నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నా’ అని చెప్పింది.
Also Read: రోజా రాజీనామాకు రెడీయేనా?

అలాగే మరో అప్ డేట్ విషయానికి వస్తే.. బాలయ్య బాబుతో సినిమా తీయాలని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నాడట. గతంలో బాలయ్యకు చెప్పిన కథను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడట. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అన్నట్టు దర్శకుడు పరుశురామ్. కూడా బాలయ్యతో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్న పరుశురామ్.. కాగా ‘సర్కారు వారి పాట’ సినిమా పూర్తైన తర్వాత బాలయ్య బాబుతో పరుశురామ్ సినిమా ఉంటుందట.
Also Read: నేడు మోడీ రాక.. సమతమూర్తి రామనుజ విగ్రహావిష్కరణ.. ఇక్రిసాట్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
[…] Tollywood Heroes Education Businesses: టాలీవుడ్ లో ప్రస్తుతం ప్రతి హీరో ఏదో రకంగా వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. మన హీరోలు ముందు నుంచీ మంచి బిజినెస్ మెన్ లు అనిపించుకుంటున్నారు. గతంలో స్టార్ హీరోలే ఎక్కువగా వ్యాపారాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్నాచితకా హీరోలు కూడా కొత్త కొత్త బిజినెస్ లతో దూసుకుపోతున్నారు. ఎంతైనా.. ఈ హీరోలంతా బాగా చదువుకున్నారు. […]