Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ అటెంప్ట్ చేశారట. ఒక ప్రక్క ఇంట్లో సమస్యలు, మరో ప్రక్క ప్రేమ వైఫల్యం. మానసిక ఒత్తిడికి గురైన సాయి ధరమ్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడట. అయితే ఇది నిజ జీవితంలో కాదు. విడుదలకు సిద్దమైన బ్రో మూవీలో. తమిళ హిట్ మూవీ వినోదయ సితం రీమేక్ గా బ్రో తెరకెక్కింది. ఈ మూవీలో కథ అదేనట. జీవితంలో సమస్యలు చుట్టుముట్టి నిస్పృహలోకి జారుకున్న యువకుడిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉంటుందట.
ఇక ఈ జీవితం వద్దు. ముగించేద్దాం అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ దేవుడిగా ఎంట్రీ ఇస్తాడు. బ్రో అంటూ సాయి ధరమ్ లోని పిరికితనాన్ని దూరం చేశాడు. చావాలనే ఆలోచనలు చంపేసి, నిజమైన జీవితం అంటే ఏమిటో పరిచయం చేస్తాడట. ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మధ్య వచ్చే ఫన్నీ, సెటైరికల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలవనున్నాయి.
అలాగే గుండెలు బరువెక్కించే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నాయట. బ్రో చిత్రానికి త్రివిక్రమ్ అందించిన మాటలు, స్క్రీన్ ప్లే ప్లస్ అయ్యాయంటున్నారు. బ్రో జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కింది. బ్రో చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బైక్ ప్రమాదం నుండి కోలుకున్న సాయి ధరమ్ తేజ్ పూర్తి స్థాయిలో సినిమాలకు సన్నద్ధం అయ్యారు. ఆయన వరుస ప్రాజెక్ట్స్ ప్రకటిస్తున్నారు. ఆయన లేటెస్ట్ రిలీజ్ విరూపాక్ష భారీ విజయం అందుకుంది. సాయి ధరమ్ తేజ్ కి పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ అని చెప్పాలి. దర్శకుడు సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారట.