Deepthi Sunaina: అన్ని ప్రేమలు తీరాలకు చేరవు. కొన్ని మధ్యలోనే బ్రేకప్ అవుతుంటాయి. బిగ్ బాస్ కు ముందు చిలకా గోరింకలు లాగా ఉన్న షణ్ముఖ్-దీప్తి సునయనల జోడి ఆ తర్వాత విడిపోయారు. బిగ్ బాస్ స్టేజీపై వీరి చూడముచ్చటైన జంటను చూసి ఎవరికి కన్ను కుట్టిందో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.

Also Read: Minister Kodali Nani: ఫైర్ బ్రాండ్ కొడాలి నానికి వేటు తప్పదా.. ఆయన ప్లేస్ లో వచ్చేది అతనేనట..
అయితే ఆ విడిపోయిన బాధ మాత్రం ఇద్దరూ భారంగానే భరిస్తున్నట్టు తెలుస్తోంది. దీప్తి సునయన బ్రేకప్ బాధను సోషల్ మీడియాలో పోస్టులతో బయటపెడుతున్నారు. భారమైన డైలాగులు, ఎమోషనల్ వీడియోలతో ఆ బాధను భరిస్తున్నారు. ఇక షణ్ముఖ్ అయితే ఇటీవల మా టీవీలో ‘మైల లవ్ ఈజ్ గాన్’ అనే పాటకు డ్యాన్స్ చేసి దీప్తితో విడిపోయిన లవ్ ఫెయిల్యూర్ బాధను ఓపెన్ గానే బయటపెట్టాడు.

తాజాగా దీప్తి సునయన సైతం ఒక బ్రేకప్ పాటను అంతే ఎమోషనల్ గా పాడి తన బాధను పరోక్షంగా బయటపెట్టింది. ‘మొట్టమొదటి.. చిట్టచివరి కష్టం ఇదే లే’… అంటూ తనలోని ప్రేమ బాధను పాట రూపంలో చక్కగా బయటపెట్టింది. ఆ పాట పాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. చెప్పుకోలేని బాధనంతా తన పాటలో బయటపెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ విరహ వేధనను ఆపి ఇద్దరూ కలిస్తే చూడాలని అందరూ కోరుకుంటున్నారు.
Also Read:Most Awaited Movies in 2022: 2022లో ఇండియాలో మోస్ట్ అవైటెడ్ టాప్ 10 సినిమాలు ఇవే..
[…] Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ ఓటీటీ మొదలై వారం గడిచింది. ఫస్ట్ వీక్ లో ఊహించని విధంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక రెండో వారం నామినేషన్స్ ముగిశాయి. ఈసారి ఏకంగా 11 మంది నామినేట్ కావడం సంచలనమైంది. […]
[…] Alia Bhatt In Hollywood: బాలీవుడ్ బ్యూటీ, ఇటీవలే గంగూబాయ్‌తో సూపర్ హిట్ అందుకున్న అలియా భట్ హాలీవుడ్‌లోకి ఎంటరవబోతోంది. ఇప్పటికే RRR చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకీ పరిచయమైన అలియా, హాలీవుడ్‌లో వండర్ వుమన్‌గా పేరుపోయిన గాల్ గాడట్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తోంది. హార్ట్ ఆఫ్ స్టోన్ పేరుతో వీరిద్దరూ కలిసి ఓ స్పై చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తుండగా, తెలుగులోనూ చూడొచ్చు. […]