https://oktelugu.com/

Director Arrested In Rape Case: అత్యాచారం చేశాడని నటి ఫిర్యాదు.. ప్రముఖ దర్శకుడి అరెస్ట్

Director Arrested In Rape Case: సినీ ఇండస్ట్రీ అన్నాక చిలక్కొట్టుడు వ్యవహారాలు బోలెడన్నీ ఉంటాయని ఆ ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అవకాశాల కోసం నటీమణులను లోబరుచుకోవడం.. ఇక అవకాశాలు దక్కేందుకు నటీమణులు కాంప్రమైజ్ అయినట్టు చాలా మంది సినీ నటీమణులు ‘మీటూ’ ఉద్యమంలో చెప్పుకొచ్చారు. కొందరు సినీ ప్రముఖులు అయితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్లతో సహజీవనం కూడా చేసేశారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా సెకండ్ సెటప్ పెట్టారు. వారి బాగోతాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 7, 2022 / 04:53 PM IST
    Follow us on

    Director Arrested In Rape Case: సినీ ఇండస్ట్రీ అన్నాక చిలక్కొట్టుడు వ్యవహారాలు బోలెడన్నీ ఉంటాయని ఆ ఇండస్ట్రీ గురించి తెలిసిన వారందరికీ తెలుసు. అవకాశాల కోసం నటీమణులను లోబరుచుకోవడం.. ఇక అవకాశాలు దక్కేందుకు నటీమణులు కాంప్రమైజ్ అయినట్టు చాలా మంది సినీ నటీమణులు ‘మీటూ’ ఉద్యమంలో చెప్పుకొచ్చారు.

    Director Liju Krishna

    కొందరు సినీ ప్రముఖులు అయితే ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన హీరోయిన్లతో సహజీవనం కూడా చేసేశారు. పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా సెకండ్ సెటప్ పెట్టారు. వారి బాగోతాలు ఇటీవల టాలీవుడ్, కోలీవుడ్ లోనూ బయటపడ్డాయి. ప్రముఖ టాలీవుడ్ కెమెరామెన్ పై ఓ యువ నటి ఇటీవల తనతో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిందని కోర్టుకు కూడా ఎక్కింది.

    Also Read: Radhe Shyam : ‘రాధేశ్యామ్’ సెన్సార్ పూర్తి అయ్యింది.. నిడివి ఎంతంటే ?

    ఈ పరంపరంలోనే తాజాగా మరో దర్శకుడి బాగోతం వెలుగుచూసింది. దర్శకుడిగా తొలి సినిమా షూటింగ్లో ఉండగానే మలయాళీ డైరెక్టర్ లిజు కృష్ణ రేప్ కేసులో చిక్కుకున్నాడు. ‘నివిన్ పౌలి’ హీరోగా మలయాళంలో ‘పడవెట్లు’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో లిజుకృష్ణ దర్శకుడిగా మలయాళ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం సినిమా అండర్ ప్రొడక్షన్ లో ఉంది.

    Director Liju Krishna

    ఈ క్రమంలోనే లిజు కృష్ణ తనపై అత్యాచారం చేశాడని.. లైంగిక వేధించాడని ఓ నటి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే కన్నూర్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు లిజు కృష్ణ ను పోలీసులు అరెస్ట్ చేయడం మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది.

    లిజు కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పడవెట్టు’ సినిమాలో నివిన్ పౌలితోపాటు మంజూ వారియర్, అదితి బాలన్ నటిస్తున్నారు. దర్శకుడి అరెస్ట్ తో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

    Also Read: Samantha Remuneration: రెమ్యునరేషన్ పెంచేసిన సమంత !

    Tags