Balakrishna- Lamar University Professor: అమెరికన్ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో బాలకృష్ణ పాట పాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. బాలయ్య కెరీర్లో పైసా వసూల్ మూవీ ప్రత్యేకం అని చెప్పొచ్చు. జయాపజయాలు పక్కన పెడితే దర్శకుడు పూరి జగన్నాధ్ సరికొత్తగా బాలకృష్ణను వెండితెరపై ఆవిష్కరించారు. పైసా వసూల్ మూవీలో బాలయ్య పాత్ర యాటిట్యూడ్, మేనరిజమ్స్ అలరిస్తాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య స్వయంగా ఓ పాట ఆలపించారు. బాలయ్య పాడిన పాటతో పాటు టైటిల్ సాంగ్ ‘పైసా వసూల్’ బాగా ఫేమస్.

ఈ పాటను క్లాస్ రూమ్ లో ఒక అమెరికన్ ప్రొఫెసర్ పాడారు. టెక్సాస్ రాష్ట్రంలోని లామర్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు తన ప్రొఫెసర్ కి పైసా వసూల్ మూవీలోని సాంగ్ నేర్పించారు. ఆయనకు లిరిక్స్ రాసివ్వడం జరిగింది. పైసా వసూల్ సాంగ్ ని సదరు అమెరికన్ ప్రొఫెసర్ క్లాస్ రూమ్ లో సరదాగా పాడారు. ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ప్రొఫెసర్ బాలయ్య పాడిన పాటకు సంబంధించిన వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.
పైసా వసూల్ చిత్రంలో శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. 2017లో విడుదలైన పైసా వసూల్ కమర్షియల్ గా ఆడలేదు. బాలయ్య ఫ్యాన్స్ మాత్రం మూవీని ఎంజాయ్ చేశారు. ఇటీవల బాలయ్యతో పూరి మూవీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

ఇక వీర సింహారెడ్డి మూవీతో బాలకృష్ణ సంక్రాంతి సమరానికి సిద్ధం అవుతున్నారు. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న వీర సింహారెడ్డి పై భారీ అంచనాలున్నాయి. విడుదలైన ప్రోమోలతో పాటు బాలయ్య లుక్ కి విశేష స్పందన లభించింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ క్యాస్టింగ్ తో వీర సింహారెడ్డి చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీర సింహారెడ్డి బాలయ్య కెరీర్లో మరొక బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సంక్రాంతి కానుకగా చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు విడుదల కానున్నాయి. భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో సంక్రాంతి సమరం ఆసక్తికరంగా మారనుంది.
Professor tho paisa vasool song padincharu 😎😎😎😎#JaiBalayya#NandamuriBalakrishna pic.twitter.com/bk3jYh4Ei1
— Nimmagadda Pavan Krishna (@pavantarakian98) November 18, 2022