Lakshya Telugu Movie Review: లక్ష్య రివ్యూ

Lakshya Telugu Movie Review ప్రధాన తారాగణం: నాగశౌర్య, కేతికా శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, రవిప్రకాష్ తదితరులు. ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ కెమెరా: రామ్ మాటలు: సృజనామణి సంగీతం: కాలభైరవ నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి రేటింగ్ : 2.75 ప్రాచీన క్రీడా నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘లక్ష్య‘. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ […]

Written By: Shiva, Updated On : December 10, 2021 6:28 pm
Follow us on

Lakshya Telugu Movie Review
ప్రధాన తారాగణం:
నాగశౌర్య, కేతికా శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, రవిప్రకాష్ తదితరులు.
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ
కెమెరా: రామ్
మాటలు: సృజనామణి
సంగీతం: కాలభైరవ
నిర్మాతలు: నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
రేటింగ్ : 2.75

ప్రాచీన క్రీడా నేపథ్యంలో నాగశౌర్య కథానాయకుడిగా వచ్చిన సినిమా ‘లక్ష్య‘. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో శరత్ మరార్ ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
పార్ధు (నాగశౌర్య) ఆర్చరీ ప్లేయర్. అతడిలో క్రీడాకారుడిని అతడి బాల్యంలోనే తాతయ్య రఘురామయ్య (సచిన్ ఖేడేకర్) గుర్తించి.. ఆస్తులు అన్నీ అమ్మి మనవడికి శిక్షణ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి ఆడి… స్టేట్ లెవల్ ఛాంపియన్ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్ ట్రయల్స్ కి సన్నద్ధం అయ్యే సమయంలో తాతయ్య మరణించడంతో బాధలో… ఆటలో గెలవడం కోసం మత్తు పదార్థాలకు బానిస అవుతాడు. అది తెలిసి అకాడమీ అతడిని సస్పెండ్ చేస్తుంది. అసలు, పార్ధు మత్తుకు బానిస కావడానికి కారణం ఎవరు? పార్థును కాపాడిన సారథి (జగపతి బాబు) ఎవరు? పార్ధు జీవితంలో రితికా (కేతికా శర్మ) పాత్ర ఏమిటి? మళ్లీ పార్ధు ఆర్చరీకి దగరయ్యాడా? లేదా? చివరకు పార్థు జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

నాగశౌర్య ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో మంచి ఎమోషనల్ టైమింగ్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. అలాగే ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ సీక్వెన్స్ లో అండ్ మిగిలిన యాక్షన్ సీన్స్ లో కూడా శౌర్య సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

ఇక పాత్ర‌లు, వాటి ప‌రిచ‌యం, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సాగుతూ.. సినిమా పై జోష్ పెంచాయి. కానీ ద్వితీయార్థంలో క‌థ మ‌ళ్లీ నెమ్మ‌దిస్తుంది. అయితే కొన్ని సీన్స్ లో ఎమోష‌న్స్ పండినా… ప్ర‌తీ పాత్ర‌కూ జస్ట్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వటానికి తప్ప ఇంట్రెస్ట్ కలిగించలేదు.

పైగా దర్శకుడు రాసుకున్న స్టార్టింగ్ సీన్స్ కూడా స్లోగా ఉన్నాయి. అలాగే ఎమోషనల్ ట్రాక్ కి సంబంధించి మరింత డిటైల్డ్ గా చూపించి ఉంటే.. సినిమా ఇంకా బెటర్ గా ఉండేది.

ప్లస్ పాయింట్స్ :
నాగశౌర్య నటన,
మెయిన్ పాయింట్, కథలోని మలుపులు,
ఎమోషనల్ సన్నివేశాలు,
సంగీతం,
సినిమాలో చెప్పిన మెసేజ్,

మైనస్ పాయింట్స్ :
సెకండాఫ్ స్లోగా సాగడం,
సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,
హీరో లవ్ ట్రాక్స్.

Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ పై స్పందించిన మెగా స్టార్ చిరంజీవి, మహేష్ బాబు…

సినిమా చూడాలా ? వద్దా ? :
భిన్నమైన స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఎమోషనల్ గా సాగుతూ బాగానే ఎంటర్టైన్ చేస్తోంది. గ్రిప్పింగ్ నరేషన్ , కథలోని సహజత్వం వంటి అంశాలు బాగున్నాయి. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. తప్పకుండా చూడొచ్చు.

Also Read: Heroine: హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది, హీరోగారి ఫోకస్ పెరిగింది !

Tags