https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప’ పై మంచు లక్ష్మి కామెంట్స్.. రియాక్ట్ అయిన బన్నీ !

Pushpa: ‘పుష్ప’ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’లో చూసి తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. తాజాగా మంచు లక్ష్మి కూడా స్పందిస్తూ.. ‘పుష్ప సినిమా అదిరిపోయిందని, మెయిన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది అని.. బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ తెగ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. అన్నట్టు పనిలో పనిగా తన రివ్యూ కూడా ఇచ్చింది. పుష్పరాజ్ లాంటి పాత్రను చేయడం చాలా కష్టం అని తేల్చి చెప్పింది. పైగా బన్నీని […]

Written By:
  • Shiva
  • , Updated On : January 9, 2022 / 06:38 PM IST
    Follow us on

    Pushpa: ‘పుష్ప’ సినిమాను ‘అమెజాన్ ప్రైమ్’లో చూసి తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. తాజాగా మంచు లక్ష్మి కూడా స్పందిస్తూ.. ‘పుష్ప సినిమా అదిరిపోయిందని, మెయిన్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ ఓ రేంజ్‌లో ఉంది అని.. బన్నీకి హ్యాట్సాఫ్ అంటూ తెగ ఎగ్జైట్ అవుతూ చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి. అన్నట్టు పనిలో పనిగా తన రివ్యూ కూడా ఇచ్చింది. పుష్పరాజ్ లాంటి పాత్రను చేయడం చాలా కష్టం అని తేల్చి చెప్పింది.

    Lakshmi Manchu

    పైగా బన్నీని పొగుడుతూ.. ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర చేసి మెప్పించడం అద్భుతం అంటూ మంచు లక్ష్మి తెలిపింది. మరి బన్నీని మాత్రమే పొగిడితే ఏమి బాగుంటుంది ? అందుకే.. హీరోయిన్స్ గురించి రెండు ముక్కలు పాజిటివ్ గా మెసేజ్ లు పెడుతూ… ఈ సినిమాలో సమంత తన డాన్స్‌ తో, రష్మిక తన నటనతో కేక పెట్టించారంటూ మంచు లక్ష్మి ఓ రేంజ్ లో మెసేజ్ చేసింది.

    ఇక దేవిశ్రీప్రసాద్ గురించి చెబుతూ దేవి కూడా అదిరే మ్యూజిక్‌ తో మైండ్ బ్లాంక్ చేశాడు అంటూ, అలాగే మిగిలిన పుష్ప టీమ్‌ ను కూడా మంచు లక్ష్మి మెచ్చుకుంటూ ట్వీట్స్ చేసింది. ఇక పుష్ప 2 కోసం కూడా మంచు లక్ష్మి తీవ్రంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. మరి మంచు లక్ష్మి గారు ఈ స్థాయిలో మెసేజ్ లు చేస్తే.. అల్లు అర్జున్ థాంక్స్ చెప్పకుండా ఎందుకు ఉంటాడు. అందుకే బన్నీ కూడా స్పందిస్తూ థాంక్స్ చెప్పాడు.

    Also Read: Pawan Kalyan: పవన్ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ పై క్రేజీ అప్ డేట్

    ఏది ఏమైనా ‘పుష్ప’ పై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మహేష్ కూడా ‘పుష్ప’ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా పుష్ప మూవీ చూసి ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్స్ చేశాడు. మొత్తానికి పుష్ప పై సినీ ప్రముఖులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. మరి పుష్పలో అంత గొప్పగా ఏమి నచ్చిందో వాళ్ళకే తెలియాలి.

    Also Read: Rajamouli: రాజమౌళి ఫ్రిజ్ లో ఈగలు.. స్టోరీని రివీల్ చేసిన చెర్రీ, తారక్..!

    Tags