Kushi Collection: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి రీసెంట్ గా విడుదల అయ్యి , డీసెంట్ టాక్ తెచ్చుకుంది. పైగా ఈ సినిమా ఆడియో కూడా మంచి హిట్ అవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరిగాయి. దీనితో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపు 70 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి హౌరా అనిపించింది. దీనితో ఖుషి సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నారు.
కానీ ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ చూస్తుంటే ఖుషి ఆర్థికంగా తేడా కొట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సినిమాను నైజం లో 15 కోట్లు, సీడెడ్ 6 కోట్లు, ఆంధ్ర ఏరియాలో 20 కోట్లకు ఇచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో 41 కోట్ల కు సినిమాను అమ్మేశారు. అలాగే రెస్టాఫ్ ఇండియా, ఓవర్శిస్ లో కలిపి మరో 12 కోట్ల దాకా ఇచ్చారు. దీనితో మొత్తం 53 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది ఖుషి సినిమా. సినిమా తీసుకున్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాలు చూడాలంటే సినిమా 53 కోట్లు నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది.
అయితే తొలి మూడు రోజుల్లో దాదాపు 33 కోట్ల నెట్ వసూళ్లు చేసిన ఖుషి సినిమా 4, 5 వ రోజుల్లో కేవలం 3 కోట్లు మాత్రమే వసూళ్లు చేసి ఓవరాల్ గా 36 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీనితో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 17 కోట్ల నెట్ కలెక్ట్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆ స్థాయి వసూళ్లు కష్టమే అనిపిస్తుంది. ఈ వారమే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ విడుదల కాబోతుంది.
గత సినిమా పఠాన్ సూపర్ హిట్ కావడంతో తెలుగులో కూడా జవాన్ మీద అందరి ఫోకస్ ఉంది. అదే విధంగా నవీన్ పోలిశెట్టి, అనుష్క కలిసి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విడుదల కాబోతుంది. ఈ రెండిటిలో ఒక్క దానికైనా మంచి హిట్ టాక్ వస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఖుషి కలెక్షన్స్ మీద పడే అవకాశం లేకపోలేదు. దీనితో ఖుషి చిత్ర యూనిట్ కొంచెం ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క హీరో విజయ్ కూడా సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటూ తనవంతు సాయం చేస్తున్నాడు.