Kumari aunty: ఆ సింగర్ ఇంట్లో పనిచేసిన కుమారీ ఆంటీ.. ఆయన వల్లే హోటల్ పెట్టిందా?

కరోనా సమయంలో ఏం చేయాలో తెలియక ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు పడ్డించిందట. ఆ తర్వాత ఇలా హోటల్ పెట్టి ఫుల్ గా ఫేమస్ అయింది. అయితే ఈమెకు మొదట్లో ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు నుంచి ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిందట.

Written By: Swathi Chilukuri, Updated On : February 5, 2024 12:45 pm
Follow us on

Kumari aunty: హోటల్ బిజినెస్ ఈ మధ్య చాలా మందికి కలిసి వస్తుంది. స్విగ్గి, జొమాటో వంటి యాప్ ల ద్వారా ఇంటికే ఫుడ్ వస్తుంది కాబట్టి మరింత తొందరగా ఈ బిజినెస్ ఊపందుకుంటుదని చాలా మంది ఈ రంగంలోకి దిగుతున్నారు. కానీ రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్స్ కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ పెట్టి ఫుల్ పాపులర్ అయింది కుమారీ ఆంటీ. ఈమె బండి వద్దకు ఎందరో వెళ్లి మరీ తింటుంటారు. ఇక ఫేమస్ అయిన దగ్గర నుంచి కుమారీ ఆంటీ దగ్గర తినడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారని టాక్.

ఇక ఫుల్ బిజినెస్ జరుగుతుండడంతో ఈమెకు రోజుకు రూ. 5000 నుంచి రూ. 6000 వరకు లాభం వస్తుందని ఈమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంటే ఒక నెల ఆదాయం దాదాపుగా రూ. 1.18 లక్షలు అన్నమాట. ఇక యూట్యూబ్ షార్ట్స్ వల్ల ఈమె పేరు మారుమోగుతోంది. ఇదిలా ఉంటే ఈమె ఒకప్పుడు సింగర్ హేమచంద్ర ఇంట్లో పనిచేశారట. ఈయన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన రూ. 30వేల వల్లే ఈ ఫుడ్ బిజినెస్ మొదలైందని తెలిపింది కుమారీ ఆంటీ. అయితే హైదరాబాద్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కావడం వల్ల ఫుడ్ బిజినెస్ వైపు వచ్చిందట ఈమె.

కరోనా సమయంలో ఏం చేయాలో తెలియక ఉన్న కొద్దిపాటి భూమిలో కూరగాయలు పడ్డించిందట. ఆ తర్వాత ఇలా హోటల్ పెట్టి ఫుల్ గా ఫేమస్ అయింది. అయితే ఈమెకు మొదట్లో ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు నుంచి ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేసిందట. మొత్తం మీద మంచి క్రేజ్ సంపాదించిన కుమారీ ఆంటీ ఫుల్ పాపులారిటీని సంపాదించింది.

ఇక ఈమెకు బిగ్ బాస్ నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే ఇప్పటికే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఈమె మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా మంచి మాటతనం ఉన్న కుమారీ ఆంటీ కచ్చితంగా ఏదో ఒక షోకు వెళ్లడం పక్కా అంటున్నారు నెటిజన్లు. మరి చూడాలి ఈమె ఎందులో మెరుస్తుందో…