Kuberaa Collection: రీసెంట్ సమయం లో ఏ సూపర్ హిట్ సినిమా చూడనంత అద్భుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వం వహించిన ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఊహించినట్టుగానే మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాక్ తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక్క తమిళనాడు లో మాత్రం ఈ చిత్రం అనుకున్న స్థాయి ఆడలేదు. కనీసం తమిళ వెర్షన్ మినిమం రేంజ్ వసూళ్లను రాబట్టి ఉండుంటే ఈ సినిమా కలెక్షన్స్ ఈపాటికి 200 కోట్ల రూపాయలకు చాలా దగ్గరగా ఉండేది. కానీ అది జరగలేదు. తమిళం లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read: తమ్ముడు’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దిల్ రాజు కి ఇది మామూలు చావుదెబ్బ కాదు!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం నిన్న ఒక్క రోజునే ఈ చిత్రానికి 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘కన్నప్ప’, మొన్న విడుదలైన తమ్ముడు చిత్రాలకంటే బాక్స్ ఆఫీస్ వద్ద చాలా బెటర్ ట్రెండ్ ని చూపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. బుక్ మై షో యాప్ లో కూడా ఈ చిత్రానికి నిన్న ఒక్క రోజునే 20 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది సాధారణమైన విషయం కాదు. ఓటీటీ కాలం లో ఇంత లాంగ్ రన్ రావడం శేఖర్ కమ్ముల మ్యాజిక్ కి మరో నిదర్శనం అంటూ చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 132 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 66 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట.
‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల అయ్యేంత వరకు కూడా ఈ సినిమాకు థియేట్రికల్ రన్ వచ్చేలా అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కొత్త సినిమాలు విడుదల లేవు కాబట్టి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ సినిమా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా నిన్ననే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది అంటున్నారు. ఫుల్ రన్ లో కచ్చితంగా 70 కోట్ల రూపాయిల షేర్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి. వరుస ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న అక్కినేని నాగార్జున కి ఈ రేంజ్ వసూళ్లు రావడంపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు. ఈ చిత్రం సక్సెస్ క్రెడిట్ ని ఎక్కువ శాతం అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఖాతాలో వేస్తుంది ట్రేడ్. ఎందుకంటే తమిళం లో పెద్ద ఫ్లాప్ అయ్యింది కాబట్టి. చూడాలి మరి ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.