Kubera Teaser : చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల(sekhar kammula). ఆయన తీసే సినిమాలు ఒక పక్క మంచి కమర్షియల్ సక్సెస్ లు సాధిస్తాయి, మరోపక్క టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ స్టేటస్ ని కూడా సొంతం చేసుకుంటాయి, కానీ సినిమాలు వేగంగా తియ్యడు అనే కంప్లైంట్ మాత్రం ఉంది. నాగ చైతన్య తో కలిసి ఆయన తీసిన ‘లవ్ స్టోరీ’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకొని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో ‘కుబేర’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా, వచ్చే నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రెండు మూడు రోజుల క్రితమే ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వచ్చాయి, కానీ అందులో ఎలాంటి నిజం లేదని మూవీ టీం ఖరారు చేసింది.
Also Read : అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి చేస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్!
ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది మూవీ టీం. ఈ టీజర్ లో అడుగడుగునా శేఖర్ కమ్ముల మార్క్ కనిపించింది. అక్కినేని నాగార్జున మరియు ధనుష్ ఇద్దరికీ కూడా మంచి క్యారెక్టర్స్ పడినట్టు ఈ టీజర్ ని చూస్తే అనిపించింది. రెగ్యులర్ టీజర్ ఫార్మాట్లో కాకుండా ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ పేరుతో, బ్యాక్ గ్రౌండ్ లో ‘నాది నాది..నాదే ఈ లోకమంతా’ అంటూ సాగే ఒక పాటని పెట్టి ఈ టీజర్ ని డిజైన్ చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ తో అదరగొట్టేసాడు.మరోసారి తన సత్తా ఏంటో ఈ చిత్రం ద్వారా చూపించాడు. అంతా బాగానే ఉంది కానీ, ఈ టీజర్ ద్వారా సినిమా స్టోరీ పై ఒక అవగాహనా ఎవరికీ కలగలేదు. ఎదో అలా సాగిపోతుంది అన్నట్టుగా అనిపించింది.
ఇలాంటి జానర్ సినిమాలు ఎక్కువగా ఓవర్సీస్ మరియు హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో పాలిటన్ సిటీస్ లో వర్కౌట్ అవుతుంది. టీజర్ ని చూస్తుంటే ఖచ్చికంగా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్టుగానే అనిపిస్తుంది కానీ, ఆ కంటెంట్ ఏంటో మాత్రం అర్థం కావడం లేదు. ఇది కూడా శేఖర్ కమ్ముల మార్క్ అనే చెప్పొచ్చు. తమిళ హీరో ధనుష్ కి తెలుగు లో ఇది రెండవ సినిమా. ఆయన మొదటి చిత్రం ‘సార్’ కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రం తో మరో భారీ హిట్ ని అందుకొని టాలీవుడ్ లో స్థిరపడాలని చూస్తున్నాడు. ఇక నాగార్జున కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా, డిఫరెంట్ తరహా పాత్రలు పోషించాలని అనుకున్నప్పుడు ఆయన కెరీర్ కి బాగా ప్లస్ అయ్యే క్యారక్టర్ పడినట్టుగా అనిపించింది. చూడాలి మరి ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత వరకు సక్సెస్ సాధిస్తుంది అనేది. మీరు కూడా ఈ టీజర్ ని చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.