Kubera Movie : సంక్రాంతి సీజన్ దాటిన తర్వాత మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో చూస్తూనే ఉన్నాం. కేవలం ఒకటి రెండు సినిమాలు మినహా, అత్యధిక శాతం సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. ప్రస్తుతం కొత్త సినిమాలు లేక, థియేటర్స్ ని నడపలేక అనేక ప్రాంతాల్లో థియేటర్స్ ని మూసివేస్తున్నారు. ఇప్పుడు ఆ థియేటర్స్ అన్ని తిరిగి తీర్చుకోవాలంటే కచ్చితంగా ఒక ప్రామిసింగ్ సినిమా రావాలి. ఆ ప్రామిసింగ్ సినిమానే రేపు విడుదల కాబోయే ‘కుబేర'(Kubera Movie) చిత్రమని బయ్యర్స్ బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ మరియు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కాబట్టి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ, తెలుగు రాష్ట్రాలు మరియు తమిళనాడు లో అడ్వాన్స్ బుకింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో ఉన్నాయి. మరోపక్క మూవీ టీం ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉంది.
ఎప్పుడూ ఇంటర్వ్యూస్ ఇవ్వని శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ఈ సినిమాకు వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అందులో భాగంగా అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ‘కుబేర’ టీం తో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ కాసేపటి క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. నాగ చైతన్య వేసిన పంచులు బాగా పేలాయి. అందులో ఒకటి తన తండ్రి నాగార్జున(Akkineni Nagarjuna) తో చెప్తూ ‘నాన్న..శేఖర్ జుట్టు ఎందుకు రింగులుగా ఉంటుందో తెలుసా?.. మానిటర్ లో ఆయన ఔట్పుట్ చూస్తున్నప్పుడు ముందున్న జుట్టు మధ్యలో చెయ్యి పెట్టి రింగులుగా తిప్పుతూ ఉంటాడు. లవ్ స్టోరీ సినిమా సమయం లో నేను ఇది గమనించాను. అందుకే ఆయన జుట్టు అలా రింగులు రింగులుగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఎన్నో సరదా సంభాషణలు ఈ ఇంటర్వ్యూ లో ఉన్నాయి.
అదే విధంగా కుబేర చిత్రం విశేషాలను కూడా ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘నేను నా కెరీర్ లో ఇలాంటి పాత్ర చేయడం ఇదే తొలిసారి. నా క్యారక్టర్ లో అనేక షేడ్స్ ఉంటాయి. ఇందులో CBI ఆఫీసర్ గా నేను నటించాను. నాకు ఈ బ్లాక్ మనీ ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి పోతుంది వంటివన్నీ పూసగుచ్చినట్టు తెలుస్తుంది. నేను మిడిల్ క్లాస్ కి చెందిన వాడిని కాబట్టి పైకి ఎదగాలి అనే తపన తో ఉంటాను, అదే సమయంలో కొన్ని సిద్ధాంతాలు అడ్డు తగులుతూ ఉంటాయి. ధనుష్ బిచ్చగాడు కాబట్టి అతనికి ఏ కోరికలు లేవు, ఒక్క పూట పొట్ట నింపుకుంటే చాలు, స్వేచ్ఛగా ఎలా బ్రతకాలి అనుకుంటున్నాడో అలా బ్రతకొచ్చు. ఇక ఇందులో విలన్ క్యారక్టర్ మల్టీ మిలినీయర్. వాడికి ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. ఇంకా ఎదో కావాలి, ఈ ప్రపంచమే నా దగ్గర ఉండాలి అనుకునే రకం’ అంటూ స్టోరీ థీమ్ ని చెప్పేసాడు నాగార్జున. మరిన్ని విషయాలు తెలియాలంటే ఈ క్రింది వీడియో చూడండి.