Kubera 3 Days Collections: ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద జైత్ర యాత్ర ని కొనసాగిస్తూనే ముందుకు దూసుకెళ్తుంది. ట్రేడ్ కూడా ఊహించని వసూళ్లను ఈ చిత్రం రాబడుతూ అందరినీ షాక్ కి గురి చేసింది. ఇలాంటి బిజినెస్ కోసమే కదా ఇన్నాళ్లు మేము ఎదురు చూసింది అంటూ థియేటర్స్ ఓనర్లు అనడంతో కంటతడి పెట్టుకుంటున్నారు. మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం,ఆ టాక్ కి తగ్గట్టుగానే మూడు రోజుల్లో 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. మరో పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ సినిమా పూర్తిగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెడుతుంది. నేడు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి హోల్డ్ ని అన్నీ ప్రాంతాల్లోనూ సొంతం చేసుకుంది ఈ సినిమా.
కాబట్టి మొదటి వారం ముగిసేలోపే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మూడు రోజుల్లో 21 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 37 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు ప్రాంతాల వారీగా ఎంత వచ్చాయో ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం లో 9 కోట్ల 20 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 2 కోట్ల 76 లక్షలు, ఉత్తరాంధ్రా ప్రాంతంలో 3 కోట్ల 31 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 64 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో కోటి 11 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 49 లక్షలు, కృష్ణా జిల్లాలో కోటి 51 లక్షలు, నెల్లూరు జిల్లాలో 79 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తమిళం లో మాత్రం బిలో యావరేజ్ రేంజ్ వసూళ్లను సొంతం చేసుకుంది.
మూడు రోజులకు కలిపి తమిళనాడు లో కేవలం 13 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక లో 6 కోట్ల 12 లక్షలు, కేరళలో 73 లక్షలు, హిందీ లో కోటి 40 లక్షలు, ఓవర్సీస్ లో 21 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి డ్రీం లాంగ్ రన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి ప్రధాన ప్రాంతాల్లో ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ హౌస్ ఫుల్ అయ్యాయి. చూస్తుంటే కేవలం నార్త్ అమెరికా నుండి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.