Kuber Movie Box office Target : ‘లవ్ స్టోరీ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బాగా గ్యాప్ తీసుకొని శేఖర్ కమ్ముల(Shekar Kammula) తెరకెక్కించిన చిత్రం ‘కుబేర'(Kubera Movie). అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ధనుష్(Dhanush) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ ఈ చిత్రం ఈ నెల 20 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యి బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రాన్ని ఏషియన్ గ్రూప్స్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ నిర్మించిన సంగతి తెలిసిందే.
Also Read: రామ్ చరణ్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే..మరి సుకుమార్ మూవీ పరిస్థితి?
ఖర్చుకి ఏమాత్రం వెనకాడని సునీల్ నారంగ్ ఈ చిత్రం కోసం దాదాపుగా 120 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేశారట. తెలుగు,తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, టాక్ వస్తే రెండు భాషల్లోనూ వసూళ్లు భారీగా వస్తాయి కాబట్టి అంత ఖర్చు పెట్టినా తప్పు లేదని సునీల్ నారంగ్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ 47 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇది మామూలు రేట్ కాదు. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం కలిపి 80 నుండి 90 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్ కి అమ్ముడుపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాపై ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది.
ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే తమిళం+ తెలుగు కలిపి 75 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. అంటే పెట్టిన 120 కోట్ల రూపాయిల బడ్జెట్ విడుదలకు ముందే రికవరీ అయిపోయి 15 నుండి 20 కోట్ల రూపాయిల లాభాలను కూడా తెచ్చిపెట్టింది అన్నమాట. ఈ రేంజ్ లో ఈమధ్య కాలంలో ధనుష్ సినిమాకు కానీ, నాగార్జున సినిమాకు కానీ బిజినెస్ జరగలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరి థియేటర్స్ లో విడుదలయ్యాక ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందో లేదో చూడాలి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి ఈ చిత్రం చేరాలంటే కచ్చితంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా చాలా బాగా వచ్చిందని, ధనుష్ కి మరో నేషనల్ అవార్డు వస్తుందని అంటున్నారు.