https://oktelugu.com/

Kriti Shetty : ఆ హీరోతో సినిమా వద్దే వద్దు.. కృతిశెట్టికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తల్లి…

ఇక ఇలాంటి క్రమంలో కృతిశెట్టి సినిమా ఇండస్ట్రీ లో ఎంతవరకు రాణిస్తుంది అనేది చూడాలి అంటు చాలామంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 24, 2023 / 08:16 PM IST
    Follow us on

    Kriti Shetty : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ కృతిశెట్టి…ఉప్పెన సినిమాతో తన మార్క్ నటనని చూపిస్తూ ఆ సినిమాలో బేబమ్మగా నటించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది.యూత్ లో మాత్రం ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసి చాలా మంది అభిమానులను సంపాదించుకుంది.

    ఇక ఇలాంటి క్రమంలో మొదట్లో ఆమె చేసిన రెండు, మూడు సినిమాలు సక్సెస్ సాధించాయి.ఇందులో భాగంగానే రీసెంట్ గా నాగ చైతన్య తో ఆమె చేసిన సినిమా ప్లాప్ ఇవ్వడంతో తెలుగులో ఆమెకి అవకాశాలు చాలా తగ్గిపోయాయి…ఇక ఆమె తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తు చాలా బిజీగా ఉంది.

    అలాగే తెలుగులో శర్వానంద్ హీరోగా వస్తున్న ఒక సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇలాంటి క్రమంలో ఆమెకి రీసెంట్ గా ఒక తమిళ్ సినిమాలో కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి లాంటి ఒక దిగ్గజ నటుడి పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ కృతిశెట్టి మాత్రం చిరంజీవితో సినిమా చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే చిరంజీవి తో సినిమా చేస్తే కృతి శెట్టి వాళ్ల తల్లి తనని ఇంటి కూడా రానివ్వనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కృతిశెట్టి వాళ్ళ అమ్మ చిరంజీవికి వీరాభిమాని దాంతో ఆమె చిరంజీవితో నటించడం గానీ ఆయనతో రొమాన్స్ చేయడం గానీ చూసి వాళ్ళ అమ్మ తట్టుకోలేదంట అందుకే ఆయన సినిమాలో హీరోయిన్ గా మాత్రం నటించవద్దని కండిషన్ పెట్టినట్టుగా తెలుస్తుంది.

    చిరంజీవి సినిమాలో కూతురుగా కానీ, చెల్లెలి గా కానీ అవకాశం వస్తే చేయమని చెప్పిందంటా, అంతే తప్ప చిరంజీవి పక్కన మాత్రం నటించొద్దని కండిషన్ పెట్టినట్టుగా ఇప్పటికే ఫిలింనగర్ సర్కిల్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.ఇక ఇలాంటి క్రమంలో అసలే కృతిశెట్టికి పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు లేవు కాబట్టి సినిమాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆల్టర్ నెట్ గా శ్రీలీల వచ్చి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాలో కూడా తనే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇలాంటి క్రమంలో కృతిశెట్టి సినిమా ఇండస్ట్రీ లో ఎంతవరకు రాణిస్తుంది అనేది చూడాలి అంటు చాలామంది వాళ్ల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.