Ram Charan-Sukumar New Movie: ‘గేమ్ చేంజర్’ వంటి భారీ డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్(Global Star Ram Charan) స్క్రిప్ట్ సెలక్షన్ పై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా తర్వాత ఆయన నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న ‘పెద్ది'(Peddi Movie) సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. సరైన సమయంలో సరైన సినిమా కోసం ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కచ్చితంగా తమ ఆకలి తీరుస్తుంది అనే నమ్మకం ఉంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రామ్ చరణ్ సుకుమార్(Sukumar) తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు కానీ,సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు అభిమానుల్లో కొత్త జోష్ ని నింపింది.
ముందుగా ఈ చిత్రం లో హీరోయిన్ క్యారక్టర్ కోసం సమంత ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఎందుకో అది కుదర్లేదు. ఆ తర్వాత రష్మిక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు వార్తలు వినిపించాయి. ఈ విషయం లో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ సినిమాలో హీరోయిన్ క్యారక్టర్ కోసం ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కృతి సనన్(Kriti Sanon) ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు ని అందుకున్న కృతి సనన్ ఈ సినిమాకు సరైన ఛాయస్ అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అందం, అభినయం, డ్యాన్స్ ఇలా అన్ని యాంగిల్స్ లోనూ కృతి సనన్ రామ్ చరణ్ కి సరిసమానమైన పోటీ ఇవ్వగలదు.
సుకుమార్ సినిమాల్లో హీరో నుండి ఎలాంటి పెర్ఫార్మన్స్ ఉంటుందో, హీరోయిన్ నుండి కూడా అలాంటి పెర్ఫార్మన్స్ ఉంటుంది. డైరెక్టర్ సుకుమార్ ఆర్టిస్టుల నుండి టాలెంట్ ని పిండుకోవడం లో నేర్పరి. ఆయన సినిమాల్లో స్టోరీ, స్క్రీన్ ప్లే కన్నా, నటీనటుల నటనే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాకు కూడా అదే జరగబోతోంది అంటూ అభిమానులు అంటున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి స్థాయి బౌండెడ్ స్క్రిప్ట్ ఇంకా సిద్ధం అవ్వలేదట. ప్రస్తుతం దుబాయి లో ఉంటున్న సుకుమార్, తన శిష్యులకు కొత్త సినిమాలను సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ పని పూర్తి అవ్వగానే ఆయన తన రైటింగ్ టీం తో కూర్చొని చరణ్ మూవీ స్క్రిప్ట్ కోసం పని మొదలు పెట్టబోతున్నాడట. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.